ఖిలావరంగల్, నవంబర్ 14: ‘నేను పక్కా లోకల్. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వచ్చి వెళ్లే టూరిస్టులు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం శివనగర్ నాలుగు జెండాల వద్ద ఏర్పాటు చేసిన చేరికల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు ఆయనకు గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వంచనగిరి నుంచి, బీజేపీ నాయకులు వర్ధన్నపేట నుంచి వచ్చి వెళ్తున్నారే తప్ప ప్రజల బాగోగులను ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. తాను స్థానికంగా ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి గోసపడ్డామని గుర్తుచేశారు. మళ్లీ ఆ పార్టీకి పట్టం కట్టి సమస్యలు కొనితెచ్చుకోవడం అవసరమా..? ప్రజలు ఆలోచించాలని కోరారు.
తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన శివనగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని నన్నపునేని చెప్పారు. శివనగర్ వరద ముంపుకు గురికాకుండా రూ. 43 కోట్లతో అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణం చేసినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇంటింటికీ నల్లా, కరెంట్, కమ్యూనిటీ భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు. కల్యాణాలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, రైతుబంధు వంటి ఎన్నో పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందనన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెరుగనున్నట్లు చెప్పారు. అలాగే, అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు, రూ. 400కు గ్యాస్, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 15 లక్షలకు లిమిట్ పెంచనున్నట్లు చెప్పారు. రైతుబంధు రూ. 16 వేలు, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో హర్షం సురేశ్, గుండు అనిల్, సాయినూతన్, రాహుల్, సాయిజయప్రకాశ్, అశోక్, అభిషేక్, శ్రీనివాస్, నరేశ్, వంశీ, రాజు, శ్రీకాంత్, కార్తీక్, వినీత్, శ్రీకాంత్, క్రాంతి, గణేశ్, రాకేశ్, శివ, పవన్, చందు, ప్రణీత్, పరమేశ్, శరత్‌తోపాటు సుమారు 300 వందల కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కానుగంటి స్వామి, నాయకులు మేరుగు అశోక్, గడ్డ రవి, మాజీ కార్పొరేటర్ కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.
ఖిలావరంగల్ పడమరకోట హనుమాన్వీధి ప్రజలు నన్నపునేనికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 38వ డివిజన్ అభివృద్ధికి రూ. 60 కోట్ల నిధులు కేటాయించి, అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించామన్నారు. ఎక్కడైనా అసంపూర్తిగా పనులు ఉంటే ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ దామోదర్‌యాదవ్, నాయకులు రాజబోయిన యాకయ్య, సోమేశ్వర్, రావుల రాజేశ్, బొల్లం కార్తీక్, కాసుల ప్రతాప్, అశోక్, మెరిపెల్లి రాజు, సారంగపాణి, నలిగంటి ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు.
గిర్మాజీపేట: రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులైన యువత బీఆర్ఎస్ వైపే ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ యూత్ నాయకుడు రామ సందీప్ ఆధ్వర్యంలో మంగళవారం 34వ డివిజన్‌కు చెందిన గుంటుక రాజేశ్, సోము, సాయి, సన్ని, మహితోపాటు మరో 60 మంది యువకులు,, 39వ డివిజన్‌కు చెందిన అన్నపూర్ణ లారీ ట్రాన్స్పోర్ట్ కాంప్లెక్స్ లక్ష్మీనగర్ హమాలీ యూనియన్ నాయకుడు శంకర్, కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ దామెర సర్వేశ్, గోవింద్భాస్కర్కు శివనగర్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో నన్నపునేని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు భాగస్వాములం అవుతామన్నారు.
కరీమాబాద్: మైనార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఫోర్టురోడ్డులో మైనార్టీ నాయకులతో సోమవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ బీఆర్ఎస్ మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తున్నదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని ఈద్గా, మసీదు, ఖబ్రస్థాన్లను అభివృద్ధి చేశామన్నారు. కోట్లాది రూపాయల నిధులతో తూర్పును ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్ పుర్ఖాన్, మసూద్, ఎంఏ జబ్బార్, మున్నా, ముస్లిం పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వీధి వ్యాపారులకు రూ. 50 కోట్లతో దుకాణాలు ఏర్పాటు చేసి, లైసెన్స్ ఇప్పించే జిమ్మేదారి తనదేనని ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాజశ్రీగార్డెన్‌లో నియోజకవర్గ వీధి వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను రాజకీయాల్లో వచ్చిందే పేదరిక నిర్మూలన కోసమన్నారు. నియోజకవర్గ ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని, మీ వ్యాపార అడ్డా ఎక్కడ ఉంటే అక్కడే వ్యాపారం చేసుకునేలా తాను కృషి చేస్తానన్నారు. ఎన్నికల తర్వాత ఖాళీ స్థలాలు ఉన్న వారికి గృహలక్ష్మీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తానన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఈగ మల్లేశం, కార్పొరేటర్లు, జెడ్ఆర్సీ మెంబర్ చింతాకుల సునీల్, వీధివ్యాపారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా అధ్యక్షుడు షేక్ ఫక్రుద్దీన్, స్వామి, రఫీ, అబీబ్, యాకూబ్, నాయకులు పాల్గొన్నారు.