ఖిలావరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి బుధవారం ఉదయం వరకు తేలికపాటి జల్లుల నుంచి మొదలు భారీ వర్షం కురిసింది. ఖానాపూర్లో అత్యధికంగా 46.6 వర్షపాతం నమోదు కాగా, పర్వతగి రిలో అత్యాల్పంగా 3.2 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
గీసుగొండలో 21.6 మిల్లీమీటర్లు, దుగ్గొండిఅలో 26.6 మిల్లీమీటర్లు, నల్లబెల్లిలో 18.8 మిల్లీమీటర్లు, నర్సంపేట లో 35.2 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 30.2 మిల్లీమీటర్లు, సంగెంలో 8.4 మిల్లీమీటర్లు, నెక్కొండలో 7.0 మిల్లీమీటర్లు, వర్ధన్నపేటలో 4.4 మిల్లీమీటర్లు, రాయపర్తిలో 3.8 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్ లో 6.2 మిల్లీమీటర్లు, వరంగల్ లో 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లావ్యాప్తంగా 17.4 మిల్లీమీటర్ల సాధన వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.