వర్ధన్నపేట, అక్టోబర్ 13 : ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పార్టీ విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. ప్రజలంతా మరోసారి సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. అంతేకాక వర్ధన్నపేట నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించినట్లు తెలిపారు.
పదేళ్ల క్రితం వర్ధన్నపేట నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని తెలుపుతూ ప్రస్తుతం జరిగిన అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పార్టీకి వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో గ్రామాల్లో విస్తృత ప్రచారాలు నిర్వహించాలని కోరారు. అలాగే, ప్రజలను మభ్య పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విపక్ష పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలను గ్రామస్థాయి కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. అలాగే ఎన్నికల్లో కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలు, ప్రచారశైలి, తదితర విషయాలపై ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమగ్రంగా చర్చించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్వతగిరి మండల ముఖ్య నాయకులతో..
పర్వతగిరి : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ ఇన్చార్జిలు, గ్రామ ఇన్చార్జిలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే అరూరి సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచార శైలి అనుసరించాల్సిన పద్ధతులపై నాయకులతో చర్చించారు. ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్‌కుమార్, గొర్రె దేవేందర్, మార్కెట్ డైరెక్టర్లు పట్టపురం ఏకాంతంగౌడ్, సర్పంచ్‌లు మాలతీ సోమేశ్వర్రావు, పిడుగు రేణుకా సాయిలు, తౌటి దేవేందర్, ఎంపీటీసీలు మాడుగుల రాజు, కర్మిళ్ల మోహన్‌రావు, మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్ పాల్గొన్నారు..
ఐనవోలు మండలంలో..
ఐనవోలు : మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలెపల్లి శంకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరయ్యారు. అభివృద్ధి వైపే వర్ధన్నపేట నియోవజవర్గ ప్రజలు ఉంటారని, మరోసారి లక్ష మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. సమావేశంలో ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, వైస్ ఎంపీపీ మోహన్, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సంపత్‌కుమార్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జయపాల్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.