హనుమకొండ, సెప్టెంబర్ 12: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నోడల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వజ్రోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు పరకాల నియోజవర్గంలో మూడు రోజుల పాటు జరిగే వజ్రోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
16వ తేదీన హయగ్రీవాచారి మైదానం నుంచి కాళోజీ సెంటర్, అదాలత్ సరిల్ మీదుగా ఆర్ట్స్ కాలేజీ వరకు 15వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒకరికీ జాతీయ జెండాలు అందించాలని సూచించారు. ఆర్ట్స్ కాలేజీలో 15వేల మందికి భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా సంఘాలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు, ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 17వ తేదీన హనుమకొండ పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ, తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అదే రోజు హైదరాబాద్‌కి వెళ్లే వారు బస్సుల్లో బయల్దేరాలన్నారు. ఇందుకుగాను బస్సులకు లైజన్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు. 18న అంబేదర్ భవన్లో స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ వాసుచంద్ర, గ్రేటర్ అదనపు కమిషనర్ రషీద్, ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, ఈఈ సంజయ్, రవికుమార్, డీఆర్డీఓ ఎ.శ్రీనివాస్‌కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మెన శ్రీను, డీపీఓ వి.జగదీశ్వర్, మెప్మా పీడీ భద్రునాయక్, ఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్, తహసీల్దార్ జి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆర్ట్స్ కళాశాల, హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానాన్ని పరిశీలించారు. 16న హయగ్రీవాచారీ మైదానం నుంచి కాళోజీ సెంటర్, అదాలత్ సరిల్ మీదుగా ఆర్ట్స్ కాలేజీ వరకు 15వేల మందితో భారీ ర్యాలీ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. డీఆర్వో ఎం.వాసుచంద్ర, హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్, తహసీల్దార్ జి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరకాస్తులను వెంటనే పరిషరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణితో కలిసి బాధితుల సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరకాస్తులపై తగినచర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్‌లో 79 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వాసుచంద్ర, డీఆర్డీఓ ఎ.శ్రీనివాస్‌కుమార్, డీపీవో వి.జగదీశ్వర్, మైనార్టీ అధికారి మేన శ్రీనుతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.