‘మన ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నేత.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వల్లే అవుతుంది.’ అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్నిధిగా ఉన్న సీఎం కేసీఆర్ దేశ స్థాయిలో పాలనా పగ్గాలు చేపడితే ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని, మంచి వేతనం అందుతుందని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ చాతుర్యం, భాషా నైపుణ్యం మెండుగా ఉన్న కేసీఆర్ ప్రజల కష్ట సుఖాలు తెలిసినోడని, అలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా మార్పు వస్తుందని నొక్కి చెబుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 12
‘సీఎం కేసీఆర్ ఏ పనిచేసినా ఆలోచించే చేస్తడు. దేశంలోని రైతులందరికీ ఉచిత కరంటు ఇస్తామని ప్రకటించిన ఏకైక వ్యక్తి ఆయనే. దేశంలో ఉత్తరాది రాష్ర్టాల నాయకులదే ఆధిపత్యం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ర్టాల నుంచి జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం’ అని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీపై పలువురు ఉపాధ్యాయులు ‘నమస్తే’తో మాట్లాడుతూ ఆయన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ లాంటి పాలకుడు తమకు కూడా ఉంటే బాగుండని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ర్టాన్ని సాధించిన తెగువతోనే అభివృద్ధిని పరుగులు పెట్టించి అనతి కాలంలోనే దేశంలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపాడని, తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలైతే అన్ని రాష్ర్టాలూ బాగుపడుతాయంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కేసీఆర్‌లా ఆలోచించే వ్యక్తులు లేరని, ఆయన తపన అంతా ప్రజల గురించేనని, ఆయన లాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ఉంటేనే దేశ ప్రజలకు మేలు జరుగుతుందని, మన దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే కేసీఆర్ లాంటి నేతల వల్లే సాధ్యమవుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు.
హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 12: ముందుచూపున్న నాయకుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశాన్ని అభివృద్ధి పథాన తీసుకెళ్తడు. ఏ పనిచేసినా ఆయన ఆలోచించే చేస్తడు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యవసాయ రంగానికి జవసత్వాలు కల్పించిండు. ముందుగా సాగుకు ఆయువు పట్టయిన విద్యుత్ రంగాన్ని బాగుచేసిండు. గతంలో రోజుకు ఐదు గంటలు కూడా కరంటు సరిగా ఉండకపోయేది. రైతులు విద్యుత్ కోసం బావుల వద్ద జాగారం చేస్తూ ప్రాణాలు విడిచిన వారెందరో ఉన్నారు. రైతాంగానికి కేసీఆర్ ఉచితంగా నిరంతర విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు సరఫరాలో ఇబ్బందులు తప్పించారు. ఇక దేశంలోనే వ్యవసాయ రంగానికి అందించిన అతి పెద్ద పథకంగా రైతుబంధు నిలిచింది. ప్రభుత్వమే పంట పెట్టుబడి ఇస్తుండడంతో అన్నదాతలకు అప్పుల బాధలు తప్పినయ్. రైతుబీమాను కూడా అందించి వారి కుటుంబాల్లో ధీమా నింపుతున్నడు. ఇతర రాష్ర్టాల ఉద్యోగులతో పోలిస్తే ఇక్కడి వారికి మంచి సౌకర్యాలు కల్పించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు కచ్చితంగా మంచే జరుగుతుంది.
– కామారపు మధు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
హనుమకొండ సబర్బన్, సెప్టెంబర్ 12: దేశంలో వేలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. కేసీఆర్ లాంటి వ్యకుల వల్లే ప్రతి నీటి చుక్క వినియోగంలోకి వస్తుంది. అన్ని రకాల నీటి వనరులను వాడుకున్నట్లయితే మనం ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతాం. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆద్భుత ప్రగతి సాధిస్తోంది. ముఖ్యంగా రైతులకు ఎనలేని సేవలు అందుతున్నాయి. సాగునీరు విషయంలో ప్రపంచం మెచ్చే ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. రైతుబీమా, రైతుబంధు పథకాలతో రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఈ పథకాలు వ్యవసాయ రంగానికి అత్యంత మేలు చేస్తున్నాయి. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతుంది.
– పెద్ది భగవాన్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భీమదేవరపల్లి
కమలాపూర్, సెప్టెంబర్ 12: అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు అవసరం. రాష్ర్టాన్ని సాధించిన తెగువతోనే అభివృద్ధిని పరుగులు పెట్టించి అనతి కాలంలోనే దేశంలో తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాడు. తెలంగాణ పథకాలు దేశంలో అమలుచేస్తే అన్ని రాష్ర్టాలు బాగుపడుతాయ్. జాతీయ రాజకీయాల్లో రాణించే సత్తా కేసీఆర్‌కు ఉంది. రాజకీయ నైపుణ్యం, భాషా పరిజ్ఞానం, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడు ఆయనను మించిన నాయకుడు లేడు. దేశంలోని రైతులందరికి ఉచిత కరంటు ఇస్తామని ప్రకటించిన ఏకైక వ్యక్తి. దేశంలో ఉత్తరాది రాష్ర్టాల నాయకులదే ఆధిపత్యం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ర్టాల నుంచి జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం. తెలంగాణ అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ లాంటి వ్యక్తి తమకు పాలకుడిగా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. ఆయన జాతీయ పార్టీ పెడితే నా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
– పటేల్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కమలాపూర్
పరకాల, సెప్టెంబర్ 12: కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులకు కట్టబెడుతోంది. దేశ సంపదను కొంత మంది చేతుల్లోనే పెడుతోంది. ఈ తరుణంలో సంపదను పెంచి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడం శుభపరిణామం. తెలంగాణ రాష్ర్టాన్ని ఒక విజన్‌తో ముందుకు తీసుకెళ్తూ ఎనిమిదేండ్లలోనే దేశానికే మార్గదర్శంగా నిలిపాడు. విద్య, వైద్యంలో గుణాత్మక మార్పులు తెచ్చాడు. 14 ఏండ్ల పోరాటంతో రాష్ర్టాన్ని సాధించాడు. కేంద్రంలో ఉత్తరాది రాష్ర్టాల పెత్తనాన్ని ఎదిరించే సత్తా ఆయనకే ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. తప్పకుండా సక్సెస్ అవుతారు.
– మోడెం రాజేందర్ బాబు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రఘునాథపల్లి, సెప్టెంబర్ 12: ప్రజలను జాగృతం చేసే నాయకత్వ లక్షణాలు కేసీఆర్‌కు ఉన్నాయి. ఆయన దేశ రాజకీయాల్లో వస్తే క్రియాశీలంగా వ్యవహరిస్తారు. భారత స్వతంత్ర వజ్రోత్సవ వేళ దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ఉచిత విద్య, వైద్యం, సంక్షేమం, సేద్యం జాతీయ సంస్థల ప్రగతి పరిరక్షణ, నవ యువత భాగస్వామ్యం కోసం కేసీఆర్ నాయకత్వం అవసరం. లౌకిక రాజ్యపాలన చేసేలా సృజన, ప్రేరణ గల నాయకుడు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను రాజులుగా చేసేందుకు రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్నారు. ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు జరుగాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిందే.
– చిందురాల నాగరాజం, టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు, రఘునాథపల్లి
హనుమకొండ, సెప్టెంబర్ 12: దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. సబ్బండ వర్గాల ప్రజల కోరిక మేరకు ఆయన దేశ రాజకీయాల్లోకి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఉద్యోగులకు వేతనాలు ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. నిరుద్యోగ సమస్యను కూడా తీర్చుతోంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్లి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ప్రపంచ మొత్తం దేశం వైపు చూసేలా మార్పు తీసుకురావాలి.
– ముప్పిడి పున్నంచందర్, సీనియర్ అసిస్టెంట్, పంచాయతీరాజ్, హనుమకొండ జిల్లా
సంగెం, సెప్టెంబర్ 12: తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ సేవలు దేశానికి అవసరం. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించిన మహానుభావుడు. రైతులకు పంట పెట్టుబడికోసం రైతుబంధు ఇచ్చి వారికి చేయూతనిచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారికి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నిలిచాడు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతటికి వర్తింపజేసే అవకాశం సీఎం కేసీఆర్‌కు వచ్చింది. ప్రజల కోసం ఆలోచించే గొప్ప మనసున్న నాయకుడు. ఆయన పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం.
– ఎల్ మొగిలి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
గీసుగొండ, సెప్టెంబర్ 12: దేశం కోసం కేసీఆర్ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేసే సత్తా కేసీఆర్‌కే ఉంది. మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. బడా వ్యాపారులకు రుణాలు మాఫీ చేస్తూ వారిని దేశం దాటిసున్నది. అభివృధ్ధిని వదిలేసి మోదీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడింది. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. వివిధ దేశాల నుండి రాష్ర్టానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. దేశంలోఉన్న రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం కేసీఆర్‌కే సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందిస్తున్న సౌకర్యాలు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది.
– అంకేశ్వరపు కుమారస్వామి, ఆర్‌యూపీపీటీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు
గోవిందరావుపేట, సెప్టెంబర్12: దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం. అలుపెరుగని పోరాటంతో అహింసా మార్గంలో సబ్బండ వర్గాలను ఏకీకృతం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ పథకాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోతే బాగుంటది. గతంలో తెలంగాణ నుంచి పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి అయి నప్పటికీ మనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించలేదు. దేశంలో స్వరం గట్టిగా వినిపించే సమర్థుడు కేసీఆర్. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఐఎంఎం, మెడికల్, ఐటీటీ కాలేజీలు మరిన్ని వస్తాయి. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశ ప్రజలందరికీ అందుతాయి.
– ఉప్పుతల ప్రసాద్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చల్వాయి
హనుమకొండ, సెప్టెంబర్ 12: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటోంది. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పు ఆయనతోనే సాధ్యం. 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని ఎనిమిదేళ్లలో చేసి చూపించారు. ఏ రాష్ట్రంలో లేని పీఆర్సీని ఇవ్వడం కేసీఆర్‌కే సాటి. వ్యవ సాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచారు. అన్ని వర్గాల వారికి 24 గంటల కరెంట్ ఇవ్వడంతో అయా రంగాల్లో అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ముఖ్యంగా రైతాంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు లాంటి ప థకాలను అందించారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశం మొత్తం రావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నారు. దేశ చరిత్రలోనే దళిత బంధు పథకం ద్వారా దళితులకు పది లక్షల రూపాయలు ఇవ్వడం సంచలనం. దేశ అభివృద్ధి కోరుకునే వారంద రూ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటున్నారు.
– ఆకుల రాజేందర్, టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ
హనుమకొండ, సెప్టెంబర్ 12: విజన్ ఉన్న నాయకుడిని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరుగాలని కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ దేశానికే నమూనాగా మారింది. అతి తకువ కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. అనేక అవార్డులను అందుకుంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో ఘణనీయమైన ప్రగతి సాధించింది.పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం ఎంతైనా ఉంది.
– బైరి సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ మిషన్ భగీరథ, హనుమకొండ జిల్లా
దేశ ప్రజలకు ప్రధానంగా కావాల్సిన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే దేశంలో కేసీఆర్ పార్టీకి తిరుగుండదు. తెలంగాణను సక్సెస్‌పుల్ మోడల్‌గా నిలిపిన ఘనత ఆయనదే. ఎనిమిదేండ్లలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఇదే మోడల్‌ను దేశమంతా ప్రవేశపెట్టాలి. ఆయన జాతీయ పార్టీకి మా మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతోపాటు జీఎస్టీతో పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన నాయకుడు జాతీయ రాజకీయాల్లో నూటికి నూరుశాతం రాణిస్తారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ప్రవేశ పెట్టాలి. ఇతర రాష్ర్టాలకు సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు. ఆయన అంటే ఒక నమ్మకం ఏర్పడింది. ఇలాంటి సమయంలో దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడాన్ని దేశమంతా స్వాగతిస్తారు.
-పులి దేవేందర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మరిపెడ
చిట్యాల, సెప్టెంబర్ 12: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. ఇప్పుడు దేశానికి ఇలాంటి నాయకుడు, నాయకత్వమే కావాలి. ఇది కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. అందుకు నిదర్శనమే ఎనిమిదేళ్ల పాలన అని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అన్ని రంగాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. అది సమర్థ నాయకత్వంతోనే సాధ్యమైంది. ఇది చూసి దేశ ప్రజానీకం తెలంగాణ వైపు తొంగి చూస్తోంది. రాష్ట్ర అభివృద్ధి వలె కావాలని దేశం ఎదురుచూస్తోంది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి నవతెలంగాణ నిర్మాణ కోసం అడుగులు వేస్తున్న ఆయన సంకల్పం గొప్పది. మారిన జీవన ప్రమాణాలు, పెరిగిన ధరలు, ఉద్యోగుల కుటంబాల సంక్షేమం, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల వేతనాలను పెంచితే కేంద్రం మాత్రం ఆదాయ పన్ను రూపంలో మింగేస్తున్నది. నవ భారత నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది.
– పంచిక భగవాన్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, చల్లగరిగె