వరంగల్, సెప్టెంబర్ 12 : అండర్‌రైల్వేగేట్ కరీమాబాద్ ప్రధాన రహదారిపై చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్లో ఇంజినీరింగ్, స్మార్ట్‌సిటీ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరీమాబాద్ రహదారిపై చేపట్టిన కల్వర్టు పనులు ఆలస్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా మెయిన్ ఫీడర్, డిష్ట్రిబూషన్ పైప్‌లైన్‌కు నష్టం కలుగకుండా పనులు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఈఈ రాజయ్య, డీఈ నరేందర్, స్మార్ట్‌సిటీ సీఎంవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాగునీటి సరఫరా సక్రమంగా చేపట్టాలని నగర మే యర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్‌బెడ్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమర్థవంతంగా తాగునీటి సరఫరా జరిగేలా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజులుగా రంగు మారిన తాగునీరు సరఫరా అవుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కార్పోరేటర్లు బస్వరాజు కుమారస్వామి, జన్ను షీబారాణి, సుంకరి మనీ షా, ఈఈ రాజయ్య, డీఈలు నరేందర్, శ్రీనాథ్, ఏఈ ముజామిల్ తదితరులు ఉన్నారు.