రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం నర్సంపేట నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కలెక్టర్ డాక్టర్ గోపితో కలిసి శుక్రవారం నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువులో 6.32 లక్షల చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ మత్స్యకారుల కష్టాలను తీర్చి వారి జీవితాలను మార్చేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషిచేశారని, తెలంగాణ వచ్చాక 100శాతం సబ్సిడీపై చేప, రొయ్య పిల్లలు ఇచ్చి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. అలాగే మార్కెటింగ్‌లో మహిళలను చైతన్యవంతులు కావాలని, ఆర్థికంగా ఎదిగేందుకు యువతకు ప్రభుత్వం అవసరమైన శిక్షణ ఇచ్చి సహకరిస్తుందని పేర్కొన్నారు.
నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 9 : రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాలోనే రెండో అతిపెద్ద చెరువైన నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో వందశాతం రాయితీపై 6.32 లక్షల ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపితో కలిసి శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం రాష్ట్రమంతటా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
మత్స్యశాఖ కార్మికులు గతంలో చాలా కష్టాలు పడ్డారని, దేశంలో ఇంకా ఇదే పరిస్థితి నెలకొందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చారని పేర్కొన్నారు. మత్స్యకార్మికులు చాలావరకు ఆర్థికంగా ఎదిగారని, వారికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేసి హక్కులు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. తెలంగాణ వచ్చాక 100శాతం సబ్సిడీ ఇచ్చి మత్స్యకార్మికుల కోసం రూ.500కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. అలాగే మార్కెటింగ్‌లో మహిళలను చైతన్యపర్చాలని కోరారు. ఆర్థికంగా ఎదగడానికి యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. కాళేశ్వరం వల్ల 753 చెరువుల్లో 365 రోజులు నిండుకుండలా నీళ్లు ఉంటున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను మత్స్యకార్మికులు ఉపయోగించుకొని కుటుంబాలను బాగుచేసుకోవాలని కోరారు. మత్స్యకారులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.
నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 338 చెరువులకు గాను 87.96లక్షల ఉచిత చేప పిల్లలను ప్రభుత్వం మంజూరు చేసిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మాధన్నపేట చెరువు అతి పెద్దదని, వరదలు వచ్చినప్పుడల్లా చెరువుల్లోని చేపలు కొట్టుకపోయి మత్స్యకార్మికులు నష్టపోతున్నందున నియోజకవర్గానికి కోటి పిల్లలు పంపిణీ మంజూరు చేయాలని కోరారు. డివిజన్లోని ప్రధాన సెంటర్లల్లో చేపలు విక్రయించేందుకు స్థలాలు కేటాయించాలని, ప్రతి మండలానికి మార్కెటింగ్ కీ పాయింట్లు ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. నీళ్ల కోసం గోస పడ్డ ఈ ప్రాంతం సీఎం కేసీఆర్ చొరవతో నేడు పచ్చని పొలాలతో కళకళలాడుతున్నదన్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలతోనే రాష్ట్ర ముఖచిత్రం మారిందని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. ప్రజల వృత్తి, జీవితాల పట్ల ముఖ్యమంత్రికి సంపూర్ణ అవగాహన ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5వేల సొసైటీలు ఉన్నాయని, ఇంకా వాటిని పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి విధానం ఎక్కడాలేదని చేపల మార్కెటింగ్‌లో అధిక లాభాలతో పాటు ప్రజలకు మంచి పోషక విలువలు అందుతాయన్నారు. మత్స్యకారుల ఆధునిక పద్దతులను అవలంబిం చి లాభాల బాటలో నడవాలని కోరారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. జిల్లాలోని 753 చెరువుల్లో 2 కోట్ల చేప పిల్లలను వదలడానికి ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. మత్స్యకార్మికుల ఇబ్బందులను తీర్చేందుకు, మార్కెటింగ్‌కు కావాల్సిన స్థలాలను గుర్తిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీవత్సవ, హరిసింగ్, జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్‌కుమార్‌నాయుడు, జడ్పీ వైస్‌చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఆర్డీవో పవన్‌కుమార్, ఏసీపీ సంపత్‌రావు, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీవో సునీల్‌కుమార్‌రాజ్, మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, ముదిరాజ్ సంఘం జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు బుస్స మల్లేశం, గుండాల మధన్‌కుమార్, సోమయ్య, నర్సయ్య, మాధన్నపేట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, ఎంపీటీసీ ఊడ్గుల రాంబా బు, ముదిరాజ్ కులస్తులు పొన్నం మొగిలి, జినుకల నర్సయ్య, తూటి శ్రీనివాస్, హంస విజయరామరాజు, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, జుర్రు రాజు, రుద్ర మల్లేశ్వరి, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు పుట్టపాక కుమారస్వామి, గంప రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు ఉన్నారు.
పర్వతగిరి: మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకున్నారు. యూత్ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడి వినాయకుడికి కొబ్బరికాయను కొట్టారు.
పర్వతగిరి మండల కేంద్రంలో తన సొంత వ్యవ సా య క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పాం తోటను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం సందర్శిం చారు. మంత్రితో పాటుగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీ బండా ప్రకాశ్ పామాయిల్ తోట ను పరిశీలించారు. పామాయిల్ తోటలతో అధికంగా లాబాలు ఉన్నాయని తెలిపారు