వర్ధన్నపేట, సెప్టెంబర్ 8: ఆసరా పింఛన్లతో అభాగ్యుల జీవితాలకు భరోసా కలుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అనేక పేదలు సంతోషంగా ఉన్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ల్యాబర్తి, కొత్తపల్లి, బొక్కలగూడెం, ఆర్డీతండా, చంద్రుతండా గ్రామా ల్లో రూ. 1.80 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు. అలాగే, కొత్తపల్లిలో 84, ల్యాబర్తిలో 95, బొక్కలగూడెంలో 37, చంద్రుతండాలో 16, ఆర్డీతండాలో 19 కలిసి మొత్తం 251 మందికి ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
అలాగే, ల్యాబర్తి, చంద్రుతడాలో నిర్మిం చనున్న గ్రామ పంచాయతీ భవనాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ వల్ల పేద కుటుంబాలకు ఆర్థిక సహకారం అందుతున్నదన్నారు. ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లు, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు వివరించారు.
ప్రజల కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాయకులను ప్రజలు నమ్మరన్నారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, సర్పంచ్‌లు కౌడగాని కవిత, పస్తం రాజు, వెంకటనారాయణ, గుగులోత్ సరోజన, ఎంపీటీసీ ఉమాదేవి, ఉపసర్పంచ్ కళింగరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.