హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : నీట్ ర్యాం కుల్లో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎస్ అశ్రిత్ (676/720), జీ సాయిప్రియ (635/720), ఎన్ సిరి (633/720) మార్కులతో జాతీయస్థాయిలో విజయపథాన్ని ఎగురవేసినట్లు తెలిపారు. అలాగే మహమ్మద్ సనోబార్(610), రాయరాకుల సుమిత్ (607), బీ సందీప్(607), పీ ఈశ్వర్‌రెడ్డి(605) మార్కులు సాధించారని చెప్పారు.
రాష్ట్రంలోని ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన 180 మందికిపైగా విద్యార్థులకు మెడిసిన్‌లో ర్యాంకులు వచ్చాయని, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని ఆచరణలో పెడుతూ విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్‌లో మరిన్ని అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. తమ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించినవారు దేశ, విదేశాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్నట్లు తెలిపారు.