దుగ్గొండి, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో కొత్తగా మంజూరైన 806 ఆసరా పింఛన్ కార్డులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాల్లో గురువారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ల అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిధంగా రాజకీయాలకతీతంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మతతత్వ బీజేపీ నాయకులు సీఎంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి ఉచిత పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. సబ్బండ వర్గాల ఆర్థిక సాధికారతకే ధ్యేయంగా రైతుబంధు, దళిత బంధు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి పథకాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామన్నారు. మండలకేంద్రానికి డబుల్రోడ్డుతోపాటు గ్రామాల అభివృద్ధికి వందశాతం సీసీరోడ్డు వేయిస్తానన్నారు.
పల్లెల్లో బీజేపీ చిచ్చు..
పచ్చగా ఉన్న పల్లెల్లో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పెద్ది పిలుపునిచ్చారు. పెట్టుబడిదారుల చేతిలో ప్రధాని నరేంద్రమోదీ కీలు బొమ్మగా మారి, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా రైతుల నడ్డి విరిచేలా విద్యుత్ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను కాపాడుకునేందుకు ప్రధానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని వెల్లడించారు. దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, ఎన్నారై రాజ్‌కుమార్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు మంద శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు సుకినె రాజేశ్వర్‌రావు, గుడిపెల్లి రాంరెడ్డి, ఊరటి మహిపాల్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
నల్లబెల్లి: సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు నకిరెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్యక్షతన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్ది, విశిష్ట అతిథిగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటు అదనంగా 7 శాతం పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో 1.2 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 79 వేల మంది పీఆర్టీయూకు మద్దతుగా ఉన్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను పీఆర్టీయూ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సామల పట్టాభి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, కార్యదర్శి పలిత శ్రీహరి, తహసీల్దార్ దూలం మంజుల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రాజేందర్, సర్పంచ్ ఎన్ రాజారాం, డివిజన్ కార్యదర్శి కోడెం సాంబయ్య, భిక్షపతి, చంద్రశేఖర్, రామచంద్రు, సుభాష్, అచ్చయ్య, అశోక్, నాగరాజు, శ్రీనివాస్, కృష్ణ, మల్లయ్య పాల్గొన్నారు.