కృష్ణకాలనీ, సెప్టెంబర్ 3 : ప్రతి ఒక్కరికీ వాహన వినియోదారుల చట్టంపై అవగాహన ఉండాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, లీగల్ సర్వీసెస్ చైర్మన్ నారాయణ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి జయశంకర్ విగ్రహం వరకు న్యాయవాదులు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, వెహికిల్ ఇన్సూరెన్స్, ఆర్సీ తప్పనిసరిగా ఉండాలన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారిపై మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇస్తామన్నారు.
గూడ్స్ వాహనాలు అధిక లోడుతో వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేయాలని, వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై సూచనలు, సలహాలు చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జయరాంరెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి రవీందర్, మహిళా జాయింట్ సెక్రటరీ ప్రియాంకరెడ్డి, కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి, రమేశ్ నాయక్, రాకేశ్, వెంకటస్వామి, న్యాయవాదులు శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ములుగురూరల్ : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ములుగు జిల్లా కోర్టు జడ్జి పీవీపీ లలిత శివజ్యోతి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి గాంధీ విగ్రహం వరకు ట్రాఫిక్, రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్‌ను తప్పక ధరించాలన్నారు. సబ్ కోర్టు జడ్జి మాధవి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పర్యాటక ప్రాంతమని, వాహనాల రాకపోకలు అత్యధిక ఉన్నాయని, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, న్యాయవాదులు వై నర్సిరెడ్డి, రంగోజు భిక్షపతి, రాచర్ల రాజ్‌కుమార్, చెలుమల రాజేందర్, ములుగు ఎస్సై ఓంకార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
– జిల్లా కోర్టు జడ్జి లలిత శివజ్యోతి