చిట్యాల, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో ప్రతి పేదింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అర్హలకు ఆసరా పెన్షన్లు అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కాల్వపల్లి, గిద్దెముత్తారం, అందుకుతండా, వెంచరామి, చైన్పాక, నైన్పాక గ్రామా ల్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీ అందజేశారు. 8 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
గిద్దెముత్తారం ప్రాథమి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, పేదల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికీ పెన్షన్లు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దుక్కుతుందన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, ముఖ్యమంత్రికి మద్దతుగా నిలువాలని కోరారు.
అనంతరం జడల్పేట గ్రామ రైతుబంధు సమితి బాధ్యుడు నల్ల సమ్మిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, జడ్పీటీసీలు గొర్రె సాగర్, పులి తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, వైస్ చైర్మన్ గణపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్లయ్య, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కామిడీ రత్నాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు పులి సునీత, పొలవేన పోషాలు, సిద్దంకి భాస్కర్, కచ్చు మల్లేశ్, రేణిగుంట్ల స్వరూప, తొట్ల లక్ష్మి, కో ఆప్షన్ మెంబ ర్ ఎండీ రాజ్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.