వరంగల్,సెప్టెంబర్ 3 : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. భద్రకాళీ అమ్మవారిని చీఫ్‌విప్ దర్శించుకున్న అనంతరం వినయభాస్కర్ దంపతులకు టీఆర్ఎస్ నాయకుడు దోమ రమేశ్ పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడకండ్ల సదాంత్, మాలకుమ్మరి పరుశరాములు, శివన్న, జగన్,సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభచీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్- రేవతి దంపతులు నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకులు శేషు ఘన స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించుకున్న వినయ్‌భాస్కర్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూ జలు చేశారు ఆలయ మహామండపంలో అర్చక బృం దం మహా ఆశీర్వచనం నిర్వహించి శేషవస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందచేశారు.
కాజీపేట : ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కాజీపేటకు చెందిన సీనియర్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. కాజీపేటలోని రైల్వే దేవాలయ సముదాయంలో వినయ్‌భాస్కర్-రేవతి దంపతుల పేర్లపై ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ దాస్యం మా ధైర్యం అన్నారు.
పేదల కోసం నిరంతరం చేసే దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజా సేవలో మందుండి భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అదిరోహించాలని వారు ఆకాంక్షించారు. వినయ్‌భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్టీఏ సభ్యుడు కాటాపురం రాజు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సుంచు కృష్ణ, 62వ డివిజన్ అధ్యక్షుడు పాలడుగుల శివకుమార్, రఘు, మర్యాల కృష్ణ, ఫర్హన్, నజీరుద్దీన్ తదితరులు ఉన్నారు.