వర్ధన్నపేట, సెప్టెంబర్ 3: మండలంలోని నల్లబెల్లి అంగన్వాడీ-1 కేంద్రంలో శనివారం పోషణ మాసోత్సవం ఘనంగా జరిగింది. అంగన్వాడీలు, మహిళలతో మార్గం ప్రతిజ్ఞ చేయించారు. నిరుపేద గర్భిణులు, పిల్లల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సర్పంచ్ ముత్యం దేవేంద్ర, ఐసీడీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ మమత పాల్గొన్నారు.
నల్లబెల్లి: మండలంలోని లెంకలపల్లి అంగన్వాడీ సెంటర్లో పోషణ మాసోత్సవంలో గర్భిణులు, తల్లులకు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీకార్యకర్త ఆకుల సునిత మాట్లాడుతూ గర్భిణులు పోషకాహారం తీసుకుంటే బిడ్డలు ఆరోగ్యంగా జన్మిస్తారని తెలిపారు. తల్లులు, పాల్గొన్నారు.
చెన్నారావుపేట: పోషణ మాసోత్సవంలో భాగంగా శనివారం మండలంలోని ఎల్లాయగూడెం రాములుతండాలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. సెక్టార్ లెవల్ ర్యాలీ నిర్వహించి తల్లులు, గ్రామస్తులతో సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బోడ విజయ, ఎంపీటీసీ రమాబాయి, ఏఎన్ఎం కవిత, స్కూల్ టీచర్ విష్ణువర్ధన్, ఉమారాణి, అరుణకుమారి, కృష్ణవేణి, పుష్ప, సుగుణ, స్వరూప, సచీదేవి, స్వర్ణలత పాల్గొన్నారు.
గీసుగొండ: మండలంలోని కొమ్మాల అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ మాసోత్సవాల్లో మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారంతోపాటు పిల్లల ఆట వస్తువులను అందజేస్తోందని ఎంపీపీ భీమగాని సౌజన్య తెలిపారు. సర్పంచ్ వీరాటి కవిత, సూపర్వైజర్ కల్యాణి, అంగన్వాడీలు పాల్గొన్నారు.
రాయపర్తి: అంగన్వాడీలు, ఆయాలు మెరుగైన సేవలు అందించాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిర్మలాపల్లిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, బాలికల్లో పౌష్టికాహార లోపం నివారణకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తోందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్, సూపర్వైజర్ సత్యవతి, అంగన్వాడీ టీచర్లు బొమ్మెర శోభారాణి, వినోద, మమత, కవిత, విజయారాణి, యమున, సంగీత, శశిరేఖ, ప్రమీల పాల్గొన్నారు.