చెన్నారావుపేట, సెప్టెంబర్ 2: మోటార్లకు మీటర్లు పెట్టే కేంద్రంలోని బీజేపీని తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి, కోనాపురం, లింగాపురం, బోజెర్వు, పాపయ్యపేట, తిమ్మారాయిన్పహాడ్, ఖాదర్‌పేట గ్రామాల్లో 1,644 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులందరికీ పింఛన్లు అందిస్తోందని తెలిపారు. దసరా పండుగ నుంచి సొంతస్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కరెంట్ పథకాన్ని ఎత్తివేయాలని, వ్యవసాయ మోటర్లకు బిగించాలని మోదీ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ను ఒత్తిడి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ రఫీ, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్‌లు శ్రీధర్‌రెడ్డి, తప్పెట రమేశ్, కోనాపురం భిక్షపతి, ఉప్పరి లక్ష్మి, అనుముల కుమారస్వామి, కొండవీటి పావని, రజితా వీరన్నానాయక్, ఎంపీటీసీలు మహేందర్, రమేశ్, విజేందర్‌రెడ్డి, శ్రీను, మొగిళి రమ, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు కృష్ణచైతన్య, చెన్నారెడ్డి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కోఆప్షన్ గఫార్, మాజీ ఎంపీపీ జక్క అధికారులు ఇన్చార్జి ఎంపీడీఓ దయాకర్, ఎంపీఓ ప్రకాశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ‘పెద్ది’ పరామర్శ
నల్లబెల్లి: పీఏసీఎస్ సీఈవో నాగెల్లి మొగిలి తల్లి బుచ్చమ్మ శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎంపీపీ ఊడుగుల సునితా ప్రవీణ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, సర్పంచు నానెబోయిన రాజారాం, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కొత్తపెల్లి కోటిలింగాచారి, పాండవుల రాంబాబు, నాగెల్లి శ్రీనివాస్, మామిండ్ల మోహన్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మోహన్‌రావు, వక్కల చంద్రమౌళి, సర్పంచు మోహన్‌రెడ్డి, లాయర్ నీలా శ్రీధర్‌రావు, నాగేశ్వర్రావు, ఊటుకూరి చెక్రపాణి, ఆకుల సాంబరావు, బత్తిని మహేశ్, రవి, చల్ల యాదగిరి, గోనె వీరస్వామి, సాంబరెడ్డి, జయపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాల్గొన్నారు.