వరంగల్, సెప్టెంబర్ 2: దేశంలోనే అరకోటి మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కీర్తి గార్డెన్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 11వ డివిజన్ లబ్ధిదారులకు శుక్రవారం నూతన పింఛన్ కార్డులు, మంజూరు పత్రాలతోపాటు పూలమొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇంత మందికి పింఛన్ డబ్బులు ఇస్తున్న దాఖలాలు లేవని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి, గ్రేటర్ డిప్యూటీ కమిషనర్ జోనా, నాయకులు దేవరకొండ సురేందర్, మాలకుమ్మరి పరశురాములు, కందుల సృజన్కాంత్, ఇల్లందుల సుభద్ర, రాంబాబు, మేడకట్ల సుకుమార్, చెన్నుపాటి దీపు, ఆయేషా ఫాతిమా, విద్య, నాగరాజు, నిరంజన్, రమేశ్, గ్రేటర్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
29వ డివిజన్లో..
మట్టెవాడ: గ్రేటర్ 29వ డివిజన్లో 286 మందికి పింఛన్ మంజూరుపత్రాలను అందజేశారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పది లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి డివిజన్లో సుమారు రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో వరంగల్‌కు వరదలు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యటించి రూ.150 కోట్లు మంజూరు చేయడంతో ముంపు సమస్య పరిష్కారమైందన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధిలో 14,186 మందికి పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 29వ డివిజన్లో 286 మందికి పింఛన్లు మంజూరైనట్లు చెప్పారు.
అనంతరు శ్రీమల్లికార్జున ఆలయం ఎదుట మొక్క నాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ నాయకుడు మస్తాన్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, 11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీసురేందర్, డిప్యూటీ కమిషనర్ జోనా, కల్పలత సూపర్ బజార్ వైస్ చైర్మన్ ఎండీ షఫీఅహ్మద్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, రాచర్ల రాము, శ్రీరాముల సురేశ్, మట్టెవాడ సారంగం, గట్టు చందు, వాడిక నాగరాజు, నక్క జ్యోతి, రుద్ర శ్రీనివాస్, రాచర్ల జగన్, శివపురం లోకేశ్, మాలకుమ్మరి పరశురాము, పూజారి కుమారస్వామి, తాళ్లపల్లి రమేశ్ క్రాంతి, మామునూరి రాజు, తాళ్లపల్లి సంతోష్ పాల్గొన్నారు.