వరంగల్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం నుంచి తొలివిడుతలో ప్రతి శాసనసభ నియోజ కవర్గానికి వంద యూనిట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారినే ప్రభుత్వం ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. దీం తో అధికారులు లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి వారి పేర బ్యాంకు ఖాతాలను తెరిచారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఈ ఖాతాల్లో జమ చేశారు. లబ్ధిదారులు కోరిన యూనిట్లను ప్రభుత్వ ని బంధనలకు లోబడి పంపిణీ చేశారు. జిల్లాలో పదమూడు మండలాలు ఉన్నాయి. మండలం వారీగా చెన్నారావుపేటకు 13, దుగ్గొండికి 12, ఖానాపురానికి 12, నల్లబెల్లికి 12, నర్సంపేటకు 14, నెక్కొండకు 13, నర్సంపేట మున్సిపాలిటీకి 24, రాయపర్తికి 20, పర్వతగిరికి 10, వర్ధన్నపేటకు 10, వర్ధన్నపేట మున్సిపాలిటీకి 14, ఖిలావరంగల్(వర్ధన్నపేట నియోజకవర్గం పరిధి)కు 9, వరంగల్ మున్సిపాలిటీకి 10, గీసుగొండకు 15, సంగెం 15, వరంగల్ మున్సిపాలిటీకి 58, ఖిలా వరంగల్‌కు 42 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ 303 యూనిట్లలో నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలవి వందేసి, వర్ధన్నపేట నియోజకవర్గానివి 53, పరకాల నియోజకవర్గానివి 30, పాలకుర్తి నియోజకవర్గానివి 20 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని లబ్ధిదారులకు అందజేసేందు కు ప్రభుత్వం రూ. 30.03 కోట్లు కేటాయించింది. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని ఖిలావరంగల్ మండలంలో కొన్ని కారణాల వల్ల ఒక యూనిట్ లబ్ధిదారుకు అందకుండా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. దళితబంధు పథకం నుంచి తొలివిడుత జిల్లాలో 302 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం పూర్తయినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ చెప్పారు.
ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌కు ఎంతమందంటే..
దళితబంధు పథకం ద్వారా తొలివిడుత జిల్లాలో యూనిట్లను పొందిన లబ్ధిదారుల్లో 187 మంది ట్రాన్స్‌పోర్టు సెక్టార్ వైపు వెళ్లారు. వీరిలో 26 మంది ఫోర్ వీలర్ ట్రాన్స్‌పోర్టు, 69 మంది ట్రాక్టర్లు, 80 మంది కారు ట్యాక్సీ, ఒకరు ప్యాడీ బాయిలర్, ముగ్గురు కలిసి గ్రూపుగా జేసీబీ, ఎనిమిది మంది కలిసి మూడు గ్రూపులుగా ఏర్పడి మూడు హార్వెస్టర్లను పొందారు. ఇలా 187 మంది లబ్ధిదారులు దళిత బంధు పథకం నుంచి 180 యూనిట్లను ట్రాన్స్‌పోర్టు సెక్టార్లో అందుకుని అధికారులను సైతం ఆశ్చర్య పరిచారు. ఆ తర్వాత 22 మంది లబ్ధిదారులు టెంట్‌హౌస్, డెకరేషన్ లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్, ఆటో ట్రాలీ, 18 మంది లబ్ధిదారులు సెంట్రింగ్, ఆర్సీసీ రూప్ మేకింగ్ (స్టీల్, ఉడెన్), కాంక్రీట్ మిక్చర్(రెడ్ మిక్స్) యూనిట్లను పొందారు. ఎనిమిది మంది మినీ సూపర్ బజార్ యూనిట్లు, ఏడుగురు కిరాణం అండ్ జనరల్ స్టోర్, ఓ ఐదుగురు హార్డ్‌వేర్, శానిటరీ మార్ట్, ఆటో ట్రాలీ, మరో ఐదుగురు షీప్, ఓ నలుగురు సిమెంట్, స్టీల్ దుకాణాలు, మరో నలుగురు ఎలక్ట్రికల్ షాపు, బ్యాటరీ సేల్స్, సర్వీస్, ఇంకో నలు గురు పెయింట్ షాపు యూనిట్లను అందుకున్నారు.
ఇతర లబ్ధిదారులు షీట్స్, టైల్స్ బిజినెస్, ఆటో మొబైల్ స్పేర్‌పార్ట్స్, ఆటో స్పేర్ పార్ట్సు, బుక్ స్టాల్ బిల్డింగ్ మెటీరియల్ స్టోర్, సెల్వరల్డ్, సిమెంట్ హార్డ్‌వేర్ అండ్ కిరాణా దుకాణం, సెంట్రింగ్ వర్క్స్, క్లాత్ ఎంపోరియం, టెక్స్టైల్ అండ్ రెడీమెడ్ గా ర్మెంట్స్ షోరూం, కాంక్రీట్ మిక్చర్ పరికరాలు, ఫెర్టిలైజర్, ఫుడ్ అండ్ బేవరేజ్ రెస్టారెంట్, ఫుట్‌వేర్ షాపు, ఫర్నిచర్ షాపు, గ్యాస్ ైస్టె స్పేర్ పార్ట్స్ అండ్ కిచెన్ ఏజెన్సీ, గ్రానెట్స్ అండ్ టైల్స్ హౌస్, ఐరన్ హార్డ్‌వేర్, కిచెన్ వేర్ అండ్ ఫర్నిచర్ షాపు, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ సహా లేడీస్ ఎంపోరియం, లెదర్ గూడ్స్, ఫుట్‌వేర్ షాపు, మెడికల్ షాపు, పేపర్ ప్లేట్లు, కప్స్, రెగ్జిన్, రైస్ దుకాణం, సారీస్ అండ్ టైలరింగ్, టెంట్ అండ్ సౌండ్స్ సిస్టమ్స్, వీడియోగ్రఫీ అండ్ ఫొటోగ్రఫీ, మినీ డెయిరీ యూనిట్లను పొందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ యూనిట్లతో లబ్ధిదారులు ఉపా ధి పొందుతున్నారు.
నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్న..
గీసుగొండ, ఆగస్టు 30 : సీఎం కేసీఆర్ అందించిన దళితబంధు పథకంలో కారు తీసుకున్న. నెల కు ఖర్చులు పోను రూ.30 వేల వరకు ఆదాయం పొందుతున్నా. అట్టడుగున ఉన్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ మరో అంబేద్కర్గా మాకు సాయం చేశారు. దళితబంధు పథకంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా ను. మరికొందరు కిరాణా షాపులు, టెంట్ హౌస్ లు ఏర్పాటు చేసుకోగా, ఇంకొందరు ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేసి ఓనర్లయ్యారు. ఒకప్పుడు డైవర్లుగా, గుమస్తాలుగా పని చేసిన మేము సీఎం కేసీఆర్ దయతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నం.
-మేకల యాకూబ్, దళితబంధు లబ్ధిదారుడు, గీసుగొండ