నడికూడ, ఆగస్టు 29 : వృద్ధుల ఆత్మగౌరవం పెంచిన ఘనత కేసీఆర్‌దే అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వరికోల్, పులిగిల్ల, రాయపర్తి గ్రామాల్లో ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికోల్‌లో 160 మందికి, పులిగిల్లలో 109, రాయపర్తిలో 123 మందికి కార్డులు అందజేశామన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాల అమలును ఆపడం లేదని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. పింఛను రానివారు ఆందోళన చెందవద్దని, త్వరలోనే వారికీ చర్యలు తీసుకుంటామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ఎందుకు చేసింది కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెట్టడానికేనా? అని ప్రశ్నించారు. గ్రామాలకు లింకు రోడ్లను ఏర్పాటు చేయడం వల్ల భూముల విలువలు పెరిగాయన్నారు. అనంతరం రాయపర్తిలో రూ.20లక్షలతో మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పులిగిల్లలో ఇటీవల చౌటుపర్తి గ్రామ అధ్యక్షుడు కంచరకుంట్ల రాజిరెడ్డి తల్లి యశోదమ్మ మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కార్యక్రమంలో సర్పంచ్‌లు సాధు నిర్మల, పాలకుర్తి సదానందం, రావుల సరిత, ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ కొడెపాక సుమలత, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, టీఆర్ఎస్ అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, మాదారం సొసైటీ చైర్మన్ నల్లెల లింగమూర్తి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు బొల్లె భిక్షపతి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, ఎంపీవో అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు వెన్నెల, నర్సింగం, నాగరాజు, టీఆర్ఎస్ నాయకుడు నందికొండ జైపాల్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు బొల్లారం అనిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సంతోషంగా ప్రజలు..
పరకాల : సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే చల్లా అన్నారు. మండలంలోని లక్ష్మీపురం, వెంకటాపురం, హైబోత్పల్లి, నాగారం, పైడిపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. నాగారంలో రూ.20లక్షలతో మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారన్నారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ మొగిలి, వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొజ్జం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.