బీజేపీలో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయి. ఇటీవల హనుమకొండకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సాక్షిగా మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లెక్సీల విషయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి మధ్య లొల్లి మొదలైంది. కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంపై రాకేశ్‌రెడ్డిపై మూడు నెలల కిందే రావు పద్మ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. మరోసారి జేపీ నడ్డా సభలో ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేసి ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి రాగా మిగతా జిల్లాల్లోనూ నేతల తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉండడం పార్టీలో గందరగోళ పరిస్థితికి అద్దంపడుతోంది. ఇలా వర్గ విభేదాలతో జిల్లా నేతలు తలలు పట్టుకుంటుంటే నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
వరంగల్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీలో గ్రూపు పంచాయితీ ముదురుతున్నది. కమ లం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగసభ సాక్షిగా ఇది స్పష్ట మైంది. ఆర్ట్స్ కాలేజీ బహిరంగ సభ ఏర్పాట్లలో సమన్వయం చేయాల్సిన జిల్లా నేతల మధ్య వర్గపోరు పెరిగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్య క్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌రెడ్డి మధ్య విభేదాలు మరోసారి పంచాయితీకి కారణమయ్యాయి. జేపీ నడ్డా బహిరంగసభ సందర్భంగా హనుమకొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దీనికి కారణమయ్యాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఏర్పాట్లతో తాము నిమగ్నమై ఉంటే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న రాకేశ్‌రెడ్డి హనుమకొండలో ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రావు పద్మ తీవ్ర అసంతృ ప్తితో ఉన్నారు. ఎవరికీ అవకాశం లేకుండా ఫ్లెక్సీలు పెట్టిన రాకేశ్‌రెడ్డిపై మిగిలిన నేతలు అస హనం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాకేశ్‌రెడ్డి జోక్యంపై రావు పద్మ మూడు నెలల క్రితమే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారిని భాగస్వాములు చేయ కుండా రాకేశ్‌రెడ్డి సొంతంగా కార్యక్రమాలు చేయడంపైగతంలో తీవ్రంగా స్పందించారు.
రాకేశ్‌రెడ్డి జోక్యంపై ఏదో ఒకటి తేల్చాలని, లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. రాకేశ్‌రెడ్డి వివరణ ఇచ్చిన తర్వాత వివాదం సద్దుమణిగింది. ఆర్ట్స్ కాలేజీ బహి రంగ సభ నేపథ్యంలో రాకేశ్‌రెడ్డి మరోసారి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీ యంగా కీలకంగా వ్యవహరించేలా చేయడంపై రావు పద్మ మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు బీజేపీలో వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ పశ్చిమ ని యోజకవర్గంలో రావు పద్మ, రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే మార్తినేని ధర్మారావు ఉనికి కోసం సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీలోని ముగ్గురు నేతల తీరు తో క్యాడర్ అయోమయం చెందుతున్నది.
మరికొన్ని చోట్ల..
బీజేపీలోని పాత నేతల మధ్య వర్గపోరుతోపాటు కొత్తగా చేరిన వారికి, పాత వారికి మధ్య పంచాయతీలు పెరుగుతున్నాయి. బీజేపీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా బలం లేకున్నా… ఉన్న ఇద్దరు ముగ్గు రు నేతల మధ్య ఎక్కడా సఖ్యత లేదని ఆ పార్టీ వారే చెప్పుకుంటు న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జరిగిన జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఆరుట్ల దశమంతరెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి మధ్య వర్గపోరు తీవ్రమైంది. రెండు వర్గాలు ఫ్లెక్సీలను చింపుకుని కొట్టుకున్నారు. బండి సంజయ్ సభలో ప్రసంగించే విషయంలోనూ ఇద్దరు నేతలు పంచాయతీకి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక్కడ మరో నేత కేవీఎల్ఎన్ రెడ్డి సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. పరకాల సెగ్మెంట్లో విజయచందర్‌రెడ్డి, సిరంగి సంతోష్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వరంగల్ తూర్పు నియో జకవర్గంలోనూ తాజాగా చేరిన వారు, ఏడాదిన్నర క్రితం చేరిన వారు, పాత నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌కు, ఆ జిల్లాలోని ఇతర నేతలకు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నా యి. బీజేపీ విధానాలకు భిన్నంగా వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ వ్యవహరిస్తున్నారని కమ లం పార్టీలోని పాత నేతలు పదేపదే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
నడ్డా సభకు..
ఆర్ట్స్ కాలేజీ బహిరంగ సభకు జనసమీకరణపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీజేపీ ముఖ్య నేతల పనితీరుపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బహిరంగసభకు జనం రాలేదని బీజేపీ జిల్లాల అధ్యక్షులు సమన్వయం చేయలేకపోయారని అన్నట్లు సమాచారం. బహిరంగ సభ జరిగిన వరంగల్ నగరం నుంచి సైతం ఆశించిన మేరకు జనం రాకపోవడానికి కారణాలను రాష్ట్ర పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిన పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చి మ సెగ్మెంట్లలో ఎక్కడా జనం లేరని, ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్య నాయకులకు బీజేపీ నాయకత్వం సూచించినట్లు తెలిసింది.