గీసుగొండ, ఆగస్టు 21: నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని కలెక్టర్ బీ గోపి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్, కోనాయిమాకుల రైతు వేదిక వద్ద కలెక్టర్, అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రభుత్వలు అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ఆకుపచ్చ తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం మోడల్ స్కూల్ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఖాళీ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, డీఎల్పీవో ప్రభాకర్, ఎంపీవో ప్రభాకర్, ఏపీవో మోహన్‌రావు, ఎంఈవో సత్యనారాయణ, ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, సర్పంచ్ అనసూర్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మొక్కలు నాటాలి
నర్సంపేట: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పుట్టిన, పెళ్లి రోజు, శుభకార్యాల సందర్భంగా విధిగా మొక్కలు నాటాలని కోరారు. నర్సంపేటలోని 11వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కౌన్సిలర్ గంప సునీతా రఘునాథ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, కౌన్సిలర్లు, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి
వర్ధన్నపేట/ఖానాపురం: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్ మొక్కలు నాటారు. అలాగే, కుమ్మరిగూడెంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ సరోజన ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, ప్రజలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ హరితహారంలో ఎంతో విలువైన మొక్కలను సర్కారు ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయడంతోపాటు ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా నాటిస్తున్నట్లు వెల్లడించారు. మొక్కలను రక్షించే బాధ్యతను జీపీ సిబ్బందితోపాటు గ్రామస్తులు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట మెగా ప్లాంటేషన్‌లో సర్పంచ్ వెన్ను శ్రుతి మొక్కలు నాటారు. హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కార్యదర్శి పూర్ణచందర్, జీపి సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం..
నల్లబెల్లి/చెన్నారావుపేట/సంగెం/రాయపర్తి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని నల్లబెల్లి ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రుద్రగూడెం పల్లెప్రకృతి వనంలో ఎంపీపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్‌కుమార్, సర్పంచ్‌లు మల్లాడి కవిత, నానెబోయిన రాజారాం, కార్యదర్శులు ధర్మేందర్, పద్మనాభస్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ కుండె మల్లయ్య పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలే ప్రాణికోటికి జీవనాధారం అన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఇన్చార్జి ఎంపీడీవో, మహేందర్‌రెడ్డి, గట్ల రాంబాబు, సాదు నర్సింగరావు, సునీల్ పాల్గొన్నారు. సంగెం మండలంలోని కుంటపల్లిలో ఎంపీపీ కందకట్ల కళావతి, ఎంపీడీవో మల్లేశం మొక్కలు నాటారు. ప్రతి మొక్కకు నీరుపోసి కాపాడాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీవో కొమురయ్య, ఉపసర్పంచ్ జక్క దూడయ్య, ప్రత్యేకాధికారి బొజ్జ సురేశ్, ఏపీవో లక్ష్మి, కార్యదర్శి వాజిద్, ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్, భూసాని మొగిలి, మాధవి పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీల నేతృత్వంలో వన మహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సకల వర్గాల ప్రజలు మొక్కలు నాటారు. మండలకేంద్రంలోని బృహత్ పల్లెప్రకృతి వనంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, మండల పశువైద్యాధికారి డాక్టర్ వీరగోని శ్రుతి, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, నాయకులు పూస మధు, గజవెల్లి రామశేఖర్, యాకూబ్, అయిత ఉమ, గుగులోత్ అశోక్‌నాయక్, కారుపోతుల రాంచంద్రయ్య, చందు రామ్‌యాదవ్, ఉబ్బని సింహాద్రి, తౌటు గణేశ్, చిన్నాల ఉప్పలయ్య, కసిరబోయిన వెంకటయ్య పాల్గొన్నారు.
మొక్కల పరిరక్షణతోనే మనుగడ
దుగ్గొండి/పర్వతగిరి: మొక్కల పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. దుగ్గొండి మండలం వెంకటాపురం, లక్ష్మీపురం, గిర్నిబావిలో మొక్కలు నాటారు. దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్యతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్‌లు సమతారాజు, పాండవుల సురేందర్, హింగోళి రాజేశ్వర్‌రావు, మహ్మదాపురం పీఏసీఎస్ చైర్మన్ ఊరటి మహిపాల్‌రెడ్డి, లక్ష్మీపురం, వెంకటాపురం ఎంపీటీసీలు మామునూరి సుమన్, కొల్లూరి విజయా మోహన్‌రావు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. పర్వతగిరిలోని బస్టాండ్ వద్ద గ్రీన్ ఇండియా చాలెంజ్ అవార్డు గ్రహీత, వనప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో రావి, వేప మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, జడ్పీటీసీ సింగ్‌లాల్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు సర్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, ఉపసర్పంచ్ రంగు జనార్దన్, నాగుల బాబు, బరిగెల విజయ పాల్గొన్నారు.