శ్రీరాంపూర్, ఆగస్టు 20: 2021-222 ఆర్థిక సంవత్సర లాభా ల్లో కార్మికుల వాటా దసరాలోగా ఇప్పిస్తామని టీబీజీకేఎస్ అ ధ్యక్షుడు బీ వెంకట్రావ్ తెలిపారు. శ్రీరాంపూర్ ఓసీపీపై కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. టీబీజీకేఎస్ ద్వారా కార్మికుల పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని పేర్కొన్నారు. కార్మికుల డిపెండెంట్ మహిళా వారసులకు, దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని చెప్పారు.
సింగరేణిలో 2021 డిసెంబర్ 31లోగా 190 మస్టర్లు నింపిన బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగోన్నతి కల్పించామని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 3800 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్ పర్మినెంట్ లేఖలు త్వరలోనే అందుతాయని వివరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కుతుందని తెలిపారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 61 ఏళ్ల సర్వీస్‌ను కోలిండియా సీఎంఫీఎఫ్ ట్రస్ట్ ఆమోదించలేదన్నారు. తమ యూనియన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. కేంద్ర కోల్‌మైన్స్ ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిందన్నారు. యాజమాన్యం రికవరీ చేసిన ఏడాది సీఎంపీఎఫ్ డబ్బులు కార్మికులకు తిరిగి చెల్లిస్తుందన్నారు.
శ్రీరాంపూర్ ఓసీపీలో కార్మికులకు వర్క్నామ్స్ ప్రకారం యాజమాన్యం ప్లేడేలు కల్పించాలని, ఈపీ ఆపరేటర్లకు ఉద్యోగోన్నతి కల్పించాలని, పీహెచ్‌డీలు ఇప్పించాలని కోరుతూ వెంకట్రావ్‌కు పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, కార్మికులు వినతిపత్రం అందించారు. యాజమాన్యంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని వెంకట్రావ్ వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర ఉపాధ్యక్షుడు డీ అన్నయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్, బ్రాంచ్ కార్యదర్శి భూపతి అశోక్, పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, మల్లెత్తుల శ్రీనివాస్, కొండ శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్, సదయ్య, శంకరయ్య, సారయ్య, అనిల్ పాల్గొన్నారు.