రాయపర్తి, ఆగస్టు 4: రాష్ట్రంలోని మహిళల సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలో సెర్ప్ సంస్థ నేతృత్వంలో గురువారం స్వర్ణభారతి మండల సమాఖ్య 12వ వార్షిక మహాసభను సమాఖ్య అధ్యక్షురాలు అమరావతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరైన మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండలంలోని మహిళా సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ రంగు కుమార్, మండల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మమత, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, డీపీఎంలు దయాకర్, సరిత, భవాని, ఏపీఎంలు పులుసు అశోక్‌కుమార్, శ్రీరామమూర్తి, ఎఫ్పీసీ చైర్పర్సన్ మమత, సీసీలు చెవ్వ యాదగిరి, అనిత, చీపురు దేవేంద్ర, పావని, వినోద పాల్గొన్నారు.
మండల సమాఖ్య భవనం పరిశీలన
మండలకేంద్రంలోని అంగడి ప్రాంతంలో సెర్ప్ ఆధ్వర్యంలో స్వర్ణభారతి మండల సమాఖ్యకు నిర్మిస్తున్న భవనం పనులను ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ ఆకస్మింగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని 39 గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్య గణనీయంగా ఉన్నదని, మండలకేంద్రంలో సమాఖ్యకు సొంత భవనం లేకపోవడంతో సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో సమాఖ్య భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఇందిరాక్రాంతి పథకం ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, మండల నాయకులు పూస మధు, మచ్చ సత్యం, ఎల్లస్వామి ఉన్నారు.