పర్వతగిరి, జూలై 22: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 4,90,500 విలువైన చెక్కులు అందించారు.
నిరుపేదలకు ఆర్థిక చేయూత
ఆరోగ్య శ్రీలో వర్తించని వ్యాధులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎందరో నిరుపేదలకు ఆర్థిక చేయూతను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీపీ కమల, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, మార్కెట్ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, సర్పంచ్ల ఫోరం మండ ల అధ్యక్షులు అమడగాని రాజు యాదవ్, చింతపట్ల సోమేశ్వర్రావు, చిన్నపాక శ్రీనివాస్, దుర్గారావు, రంగు కుమార్స్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరా మర్శించారు. వడ్లకొండ గ్రామానికి చెందిన బైరి లింగయ్య, మంద మొగిలి, నరుకుడు వెంకటమ్మ, బండి రాములు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఎంపీటీసీ రేవతి అత్త మరణించ డంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ జిల్ల శ్రీనివాస్ తండ్రి, అర్షం స్వామి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను కలిసి ఆర్థికసాయం చేశారు.