సంగెం, జూలై 21 : సంక్షేమంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మండలంలోని కాపులకనపర్తి సొసైటీలో రైతులకు పంట రుణాల పంపిణీ, డిపాజిట్ల సేకరణ కార్యక్రమం చైర్మన్ దొమ్మాటి సంపత్‌గౌడ్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు రూ.19 కోట్ల పంట రుణాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ నాడు రక్తపాతం, పోలీసులు, నక్సలైట్ల ఎన్కౌంటర్లతో ఎప్పుడు ఏమవుతుందోనని భయం గుప్పిట్లో ఉండే తెలంగాణ ప్రజల బతుకును ఉద్యమనేత కేసీఆర్ మార్చారన్నారు. గులాబీజెండా నీడలో ఉద్యమం మొదలు పెట్టి తెలంగాణ సాధించారన్నారు. రాష్ట్రంలోని 24 గంటల కరంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీరందిస్తున్నామన్నారు.
44వేల చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా మరమ్మతు చేశామన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. విద్యార్థులకు సైతం ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. సహకార సంఘాల బలోపేతం కోసం రైతులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అప్పులు ఇస్తామని రైతుల వద్దకే బ్యాంకర్లు వచ్చే స్థాయికి తెలంగాణ రైతులు ఎదిగారన్నారు. సొసైటీలోని రైతులకు సంబంధించిన రూ.12 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. సొసైటీలో ఉన్న రైతులందరూ నూ.10వేల చొప్పున డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. సంఘానికి పూర్వవైభవం తీసుకురావడానికి శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అనంతరం వినోద్‌కుమార్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని రైతులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, వరంగల్ జిల్లా రెడ్‌క్రాస్‌సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లయ్య, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, పులుగు సాగర్‌రెడ్డి, జేడీఏ ఉషాదయాళ్, వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజినల్ మేనేజర్ అశోకన్, మార్కెట్ డైరెక్టర్ సారంగపాణి, ఎంపీటీసీ సుతారి బాలకృష్ణ, సొసైటీ చైర్మన్లు కుమారస్వామి యాదవ్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీడీవో మల్లేశం, ఏవో యాకయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.