సంగెం, జూలై 17: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని, సీఎం కేసీఆర్ దేశానికే రోల్మోడ ల్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మొండ్రాయి, పల్లార్గూడ, ముమ్మిడివ రం, కుంటపల్లి, సంగెం గ్రామాల్లో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న లబ్ధిదారులకు ఆదివారం సంగెం రైతువేదికలో 62 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడారు. మచ్చాపూర్ నుంచి చెన్నారావుపేట వరకు డబుల్ రోడ్డు విస్తరణ జరుగుతు న్నందున కొంతమంది ఇండ్లు కోల్పోతున్నారని, వారి కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రూ. 5, 04,000 ఇచ్చేందుకు మంజూరు పత్రాలను అందిస్తున్నామని తెలిపారు.
గ్రామాలు అభివృద్ధి జరిగేందుకే రోడ్డు విస్తర ణ చేపట్టినట్టు, గ్రామస్తులు సహకరించాలని కోరారు. మొండ్రాయి గ్రామం మండలం అయ్యే చాన్స్ ఉందని చెప్పారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ని యోజకవర్గంలో 628 కుటుంబాలకు రెండు పడక గదు లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆగస్టు లోనే కొత్త పింఛన్లు ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపోళ్లకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు అమలు చేసే ధమ్ము వారికి లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మారుమూల ప్రాంతాలకు గోదావరి నీరందిస్తున్న ఘనత సీఎం కేసీఆ ర్దేనన్నారు. రాష్ర్టానికి నయాపైసా ఇవ్వని బీజేపీ నాయ కులు గ్రామాల్లో తిరిగితే నిలదీయాలన్నారు. కార్యక్ర మంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటే శ్వర్రావు, తహసీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సర్పంచ్‌లు గూడ కుమారస్వామి, ఇజ్జగిరి స్వప్న-అశోక్, కక్కెర్ల కుమారస్వామి, కావటి వెంకటయ్య, బాబు, ఎంపీటీసీలు కొనకటి రాణి-మొగి లి, కట్ల సుమలత-నరేశ్, మెట్టుపెల్లి మల్లయ్య, సొ సైటీ చైర్మన్లు వేల్పుల కుమారస్వామియాదవ్, వెంకటే శ్వర్లు, మార్కెట్ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, నాయ కులు గోవర్ధన్‌గౌడ్, దిలీప్‌రావు, ఉండీల రాజు, మన్సూర్అ లీ, నాగార్జునశర్మ, కౌడగాని శంకర్రావు పాల్గొన్నారు.