మహబూబాబాద్/డోర్నకల్, జూన్18 : అగ్నిపథ్ స్కీమ్‌కు నిరసనగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో శనివారం కూడా మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి, ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు. డోర్నకల్ రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, జీఆర్పీ ఎస్సై శ్రీకాం త్ , సివిల్ ఎస్సై వాంకుడోత్ భద్రూనాయక్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు బందోబస్తు చేపట్టారు.