సంగెం, జూన్ 18 : మండలంలోని పల్లార్గూడ సర్పంచ్ కక్కెర్ల కుమారస్వామి గ్రామంలో ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పేరుపై సుకన్య సమృద్ధి యోజన కింద రూ. 2వేలు ఇస్తానని గత గ్రామసభలో ప్రకటించారు. కాగా, గ్రామానికి చెందిన సింగారపు ప్రవళిక-నవీన్ దంపతులకు ఇటీవల కూతురు జన్మించగా, శనివారం జరిగిన గ్రామ సభలో వారికి సర్పంచ్ రూ.2వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి, ఏపీవో లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అజయ్, వార్డు సభ్యుడు భగవాన్‌రెడ్డి, మహిళా సంఘాల అధ్యక్షురాలు కక్కెర్ల స్వప్న, సీఏ జన్ను యాకయ్య పాల్గొన్నారు.