మహబూబాబాద్/కేసముద్రం, జూన్ 3 : రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటామని చెప్పడం కంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల్లోని రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులకు మంత్రి సత్యవతిరాథోడ్ సూచించారు. శుక్రవారం ఆమె మాహబూబాబాద్ పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో పల్లెప్రగతి, క్రీడామైదానాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో 110 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా కేక్‌కట్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సత్యవతి మా ట్లాడుతూ..అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మానుకోట పట్టణ అభివృద్ధికి తన సొంత నిధులు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నేషనల్ హైవేల నిర్మాణాలతో అనుసంధానం చేసుకుంటూ రింగ్ రోడ్డు నిర్మించేందుకు కృ షి చేస్తామని వివరించారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి నివేదికలు సమర్పిస్తే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మృతిచెందిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షల బీమా అందించి కొండంత అండగా నిలుస్తున్నదని, అదే కాం గ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకం ఉందా.. అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనకపోతే, అక్కడి రైతులు ము లుగు జిల్లాకు వచ్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ‘కన్న తల్లికి అన్నం పెట్టని కొడుకు.., సవితి తల్లికి బంగారు గాజులు చేయిస్తా’ అన్న చందంగా కాం గ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పోరా డి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్నాడని తెలిపా రు. నాడు గ్రామ పంచాయతీగా ఉన్న మహబూబాబా ద్.., నేడు జిల్లా కేంద్రంగా మారి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. చెడు అలవాట్ల నుంచి యువత దృష్టిని మళ్లించాలనే మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మానుకోట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే.., ఇది గిట్టని కొందరు తమ స్వార్థం కోసం కోర్టుల నుంచి స్టే తెచ్చి అడ్డుపడుతున్నట్లు చెప్పారు. పట్టణ అభివృద్దికి మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను వేడుకుంటానని తెలిపారు. విద్యుత్ విషయంలో 80 శాతం సమస్యలు పరిష్కరించామని ఇంకా 20 శాతం సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఒక్క కేసముద్రం మండలంలోనే ఇప్పటి వరకు 2వేల లబ్ధి చేకూరిందన్నారు. కల్వల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి నూతన భవనం నిర్మించినట్లు తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా కల్వల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో రూ.39 లక్షలతో సకల సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి నిధులతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తుప్పు పట్టిన ఇనుప విద్యుత్ స్తంభాలను మార్చి, సిమెంట్ పోల్స్ వేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతిలో ప్రజలు భాగస్వాములైనప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. మహబూబాబాద్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో 15 రోజులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి రహదారులపై నీరు నిల్వకుండా, ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మహబూబాబాద్‌లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, ఎలక్ట్రికల్ డీఈ సునీత, ఏడీ నందారాథోడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పర్కాల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి, చిట్యాల జనార్దన్, రాజశేఖర్, ఓం నారాయణలోయ, మున్సిపల్ డీఏ ఉపేందర్, శరత్, పార్థు, బ్రిజ్గోపాల్, మెప్మా అధికారులు, కేసముద్రంలో అడిషనల్ కలెక్టర్ అభిలాషాఅభినవ్, జడ్పీచైర్‌పర్సన్ బిందు, సర్పంచ్ గంట సంజీవరెడ్డి, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల నవీన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నాయకులు ఊకంటి యాకూబ్‌రెడ్డి, దీకొండ వెంకన్న, నీలం దుర్గేశ్, కముటం శ్రీనివాస్, లింగాల పిచ్చయ్య, మోడెం రవీందర్‌గౌడ్, సట్ల వెంకన్న, రవీందర్‌రెడ్డి, రమేశ్, వీరూనాయక్, నరేశ్, చంద్రయ్య, శ్రీనివాస్, రాజశేఖర్, సుధాకర్, జడ్పీ సీఈవో సన్యాసయ్య, తహసీల్దార్ ఫరీద్, ఎంపీడీవో రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.