వర్ధన్నపేట, మే 26 : ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతోనే ప్రజల్లో టీఆర్ఎస్కు విశేష ఆదరణ లభిస్తున్నదని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బుర్ర సురేందర్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎస్డీ అంకూస్ ఆధ్వర్యం లో వివిధ పార్టీలకు చెందిన సుమారు 25మంది నాయకులు, కార్యకర్తలు గురువారం ప్రశాంతినగర్‌లోని ఎమ్మె ల్యే స్వగృహంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్ప లా కాపాడుకుంటానన్నారు. రైతులు, ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో సాగునీరు లేక ఎడారిగా మారిన పంట భూము లు ఇప్పుడు సస్యశ్యాలమయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి కృషి వల్లే దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు నీరు అందుతోందని వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌ఖన్నా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, నల్లబెల్లి సర్పంచ్ ముత్యం దేవేంద్ర, ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి, కార్యకర్తలు పాల్గొన్నారు.