ఖిలావరంగల్, మే 14: హక్కుల గొంతుక డాక్టర్ బుర్ర రాములు ఆశయాలను కొనసాగిద్దామని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య పిలుపునిచ్చారు. ఖిలావరంగల్లోని అమరవీరుల స్తూపం వద్ద రాములు 11వ యాదిసభను వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తిరుపతయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామిక దృక్పథం అలవర్చుకొని సమస్యలను పోరాటాలతోనే పరిష్కరించుకోవచ్చని నిరూపించిన వ్యక్తి బుర్ర రాములు అని గుర్తుచేశారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక సహాయ కార్యదర్శి బదావత్ రాజు, న్యూడెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు, బండి కోటేశ్వరరావు, హరికృష్ణ, వెంకట్, నారాయణ, ఐలయ్య, పాల్, బొడ్డు కుమారస్వామి, బెల్లంకొండ రమేశ్, మైదం పాణి, తీగల జీవన్, పాలకుర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.