చెన్నారావుపేట, మే 12 : నియోజకవర్గంలోని 104పాఠశాలల అభివృద్ధికి మెదటి దశలో సుమారు రూ.14 కోట్లు నిధులు మంజూరయ్యాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నారావుపేట పాఠశాలలో రూ.69 లక్షలతో మొదటి దశ అభివృద్ధి పనులు చేస్తామన్నారు. పాఠశాలలో వి ద్యుదీకరణ, తాగునీరు, మరుగుదొడ్లు, నూతన గ దులు నిర్మిస్తామన్నారు. నియెజకవర్గంలోని ప్రభు త్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సోలా ర్ స్టడీ ల్యాంప్ అందజేయనున్నట్లు తెలిపారు. వి ద్యార్థుల చదువు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని కేటీఆర్ చేతుల మీదుగా నర్సంపేటలో ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకక్న, జడ్పీటీసీ ప త్తినాయక్, సర్పంచ్ కుండె మల్లయ్య, డీఈవో వా సంతి, ఎంఈవో రత్నమాల, మండల నోడల్ అధికారి సుజన్ తేజ, ఎంపీడీవో దయాకర్, టీఆర్ఎస్ యువజన నాయకుడు కృష్ణచైతన్య పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని జడ్పీటీసీ పోలీసు ధర్మారా వు, ఎంపీపీ భీమగాని సౌజన్య అన్నారు. మనుగొం డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రారంభించారు. రూ. 24 లక్షలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రభుత్వం ప్రారంభించబోతున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నమిండల రమ, తహసీల్దార్ సుహాసిని, మండల ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్, ఎంఈవో చదువుల సత్యనారాయణ, ఏఈ సుధాకర్, ఉపసర్పంచ్ రమేశ్, ఎస్ఎంసీ చైర్మన్ నమిండ్ల రాజు, హెచ్ఎం దయాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
మొగిలిచెర్లలో..
గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని కార్పొరేటర్ ఆకుల మనోహర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను మనమే కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మురళీధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, అంగన్వాడీ టీచర్ అనితాకుమారి, హెచ్ఎం స్వరూప, ఉపాధ్యాయులు పాల్లొన్నారు.