గిర్మాజీపేట, మే 9: వాసవీమాతా పరపతి సంఘం లావాదేవీల్లో అవకతవకలు జరిగిన ఘటనలో న్యాయం వైపు నిలబడిన ఎమ్మెల్యేపై అపనిందలు వేయడం సిగ్గుచేటని ఆ సంఘం సభ్యులు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొని మాట్లాడారు. వాసవీమాతా పరపతి సంఘం అడ్‌హక్ కమిటీ మునుగోటి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన అవకతవకలపై సభ్యులు ఎమ్మెల్యేకు తెలుపగా సభ్యులకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. మునుగోటి రమేశ్ తప్పులను ఎమ్మె ల్యే ఖండిస్తే ఎమ్మెల్యే, సీఐ తమకు అన్యాయం చేశారని సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జా వెంకటేశ్వర్లు, శ్రీరాం రవీందర్, గార్లపాటి నాగేందర్, శివరాజ్‌కుమార్, శివప్రసాద్, వీరభద్రయ్య, దుబ్బా శ్రీనివాస్, దాచెపల్లి సీతారం, తోట నవీన్, పున్నంచందర్ పాల్గొన్నారు.