నెక్కొండ, మే 9: కంకర అన్లోడ్ చేస్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తాకడంతో మంటలు అంటుకుని టిప్పర్ దగ్ధమైన సంఘటన నెక్కొండలో సోమవారం జరిగింది. నెక్కొండలో రైల్వే మూడోట్రాక్ ఏర్పాటు కోసం రైల్వే విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని ప్రాంతంలో భారీగా కంకర డంప్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్ జాకీ పైకి లేపగా 11 కేవీ విద్యుత్ లైన్ తాకింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. నెక్కొండ ఎస్సై సీమఫర్హీన్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పని స్థలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎస్సై మండిపడ్డారు. టిప్పర్‌కు విద్యుత్ తీగలు తాకిన వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు.