నర్సంపేటరూరల్/ నర్సంపేట/ చెన్నారావుపేట, మే 5 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని రాజుపేట గ్రామ శివారు చింతగడ్డతండా, కమ్మపల్లి, బాంజీపేట గ్రామాలకు చెందిన 150 కుటుంబాలు, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి గ్రా మానికి చెందిన 40 కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడు తూ ప్రతిపక్షాలను ఏనాడూ తాను శత్రువులుగా చూడలేదన్నారు. తాను చేస్తున్న అభివృద్ధే వారిలో మార్పు తీసుకువస్తుందని, ఏదో ఒకరోజు వారు కూడా తనతో కలిసివస్తారనే నమ్మకం ఉండేదన్నా రు. నియోజకవర్గంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు.
టీఆర్ఎస్లో చేరిన వారంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒక రూపంలో వారేనని, ప్రతిపక్ష నా యకుల ఫాలోవర్స్ ఎవరూ లేరన్నారు. నర్సంపేటలో ఇప్పటికే వెజిటెబుల్ మార్కెట్‌ను నిర్మించిన ట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదే కాకుండా మరో రూ.4.50 కోట్లతో ఫ్రూట్, ఫ్లవర్, నాన్‌వెజ్, వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మార్కెట్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మం జూరు చేసిందన్నారు. ఈ ప్రాంత కూరగాయల రైతులకు ఇక్కడి మార్కెట్లో విక్రయించుకునేందు కు వీలుగా సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
కమ్మపల్లి నవయువ యూత్ క్లబ్ అధ్యక్షుడు పెం డ్యాల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు గడ్డం ప్రభాకర్, కా ర్యదర్శులు శివకుమార్, అన్నెబోయిన శ్రీకాంత్, గడ్డం ప్రవీణ్, యూత్ సభ్యులు మిట్టగడపల హరిప్రసాద్, తప్పెట్ల చిలుకయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిట్టగడపల రాజు, మిట్టగడపల సు భాష్, సునిల్, తప్పెట్ల మహేశ్, జన్ను రాజు, మల్లయ్య, చంద్రశేఖర్, కుమారస్వామి, అరవింద్‌తో పాటు ఆయా గ్రా మాలకు చెందిన 150 కు టుంబాలు టీఆర్ఎస్లో చేరాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు సర్పంచులు బానోత్ దస్రూ, వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ లు, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, చెన్నారావుపే సొసైటీ వైస్ చైర్మన్ చింతకిది వంశీ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, సర్పంచ్ అనుముల కుమారస్వామి, ఉప్పరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు అందె వెంకటరాములు, కోనాపురం ఎంపీటీసీ మహేందర్, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి పాల్గొన్నారు.