కాశీబుగ్గ/కరీమాబాద్, మే 1: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ప్రధాన ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలుస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మేడే సందర్భంగా ఆదివారం ఆయన లక్ష్మీపురంలోని పండ్లు, కురగాయల మార్కెట్లో టీఆర్ఎస్కేవీ హమాలీ యూనియన్ల ఆధ్వర్యంలో, ఓసిటీ మైదానంలో కాకతీయ టైల్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేందర్ కార్మికుల దుస్తులు ధరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా 30 శాతం సీఆర్సీ పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. స్కీం వర్కర్స్ ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజనం కార్మికులకు వేతనాలు పెంచామని గుర్తుచేశారు.
అడుగకుండానే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచారని తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంపై పోరాటం చేయాలని నన్నపునేని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, హమాలీ సంఘం నాయకులు, కాకతీయ టైల్స్ యూనియన్ నాయకులు జన్ను సునీల్, బరిగెల ప్రమోద్, సింగారపు ప్రకాశ్, మచ్చ కోటేశ్వర్, పీ రాజు, జన్ను యాదగిరి, మచ్చ శ్యామ్, ఎస్ కుమార్, కే నాగరాజు, ఎం మహేశ్ పాల్గొన్నారు. ఎనుమాములలో కాకతీయ సెంట్రింగ్ మేస్తీల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు పసులాది మల్లయ్య జెండా ఆవిష్కరించారు. కొత్తకొండ కృష్ణ, జన్ను మధు, కేతిరి రాజశేఖర్, జన్ను అభినేశ్, సౌరం శ్రావణ్, బొంతు మురళి, పట్టాభి శ్రీను, మార్త ఈశ్వర్, పసులాది వెంకన్న, బొంకురి శంకర్ పాల్గొన్నారు.
అలాగే, కరీమాబాద్ 41వ డివిజన్లోని సామిల్ అండ్ టింబర్ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఎమ్మెల్యే ఎగురవేశారు. ఆయన వెంట కార్పొరేటర్ పోశాల పద్మ, నాయకుడు పోశాల స్వామి ఉన్నారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు కార్మిక సంఘం భవనాల్లో మేడే వేడుకలు నిర్వహించారు. అంతేకాకుండా నన్నపునేని కరీమాబాద్‌లోని అంబేద్కర్ భవన్ వద్ద బొమ్మల్ల అంబేద్కర్ ఆధ్వర్యంలో గౌతమబుద్ధ, డాక్టర్ అంబేద్కర్, బొమ్మల్ల కట్టయ్య విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపల్ల రవి, నాయకులు పల్లం రవి, బొమ్మల్ల అంబేద్కర్, ఎరుకల మహేందర్, కడారి కుమార్, నీలం మల్లేశం, తరాల రాజమణి, జక్కుల రాజు, నాగపురి సంజయ్‌బాబు, మేడిది మధు, బజ్జూరి వాసు, మండ శ్యామ్, వడ్నాల నరేందర్, బత్తిని రంజిత్ పాల్గొన్నారు.
ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం
పోచమ్మమైదాన్: వరంగల్ ఎంజీరోడ్డులోని ఇస్తామియా కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫారిన్ సిటీ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌ను తిలకించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చని ఎమ్మెల్యే అన్నారు. మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్ మసూద్, కార్పొరేటర్ ఆడెపు స్వప్న, ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎండీ అస్లాం, నాయకులు ఆడెపు శ్రీనివాస్, ఇస్లామియా ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి తాహెర్ బాయ్, మేనేజర్లు అంకిత్ గుప్తా, ఫిరోజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.