వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరికీ అన్నం పెట్టే రైతులను కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇబ్బంది పెడుతున్నది. వడ్లను కొనుగోలు చేసేది లేదని తెగేసి చెప్పింది. అన్నదాతలకు అండగా ఉండే తెలంగాణ ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. యాసంగిలో పండిన వడ్లను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. ఆరు జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రక్రియ మొదలైంది. కరోనా సమయంలో వచ్చి న రవాణా సమస్యలు లేకుండా అధికారులు జాగ్రత్త లు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రంలో కాంటా అయిన వడ్లను వెంటనే మిల్లుకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ, జనగామ జిల్లాల్లో ముం దుగా పంటలు రావడంతో ఇప్పటికే కొనుగోలు ప్రక్రి య వేగంగా జరుగుతున్నది. సాగునీరు పుష్కలంగా ఉండడం, నిరంతర కరంటుతో రాష్ట్రంలో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వరి కోత లు మొదలైన నేపథ్యంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా కా ర్యాచరణ రూపొందించారు. ఈ సీజన్లో ఆరు జిల్లా ల్లో కలిపి 5.61లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 12.60 లక్షల ట న్నుల దిగుబడి రానుంది.
2.92 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం, 2.68లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. ఉత్పత్తి అయ్యే ధాన్యంలో 6.99 లక్షల టన్నులు దొడ్డు రకం, 5.61 లక్షల టన్నులు సన్నరకం ఉంటాయని అంచనా ఉన్నది. పంట ఉత్పత్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రతిచోటా కొనుగోలు కేంద్రాల ఏర్పాటే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది. ఆరు జిల్లాల్లో కలిపి 1118 కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 704, ఐకేపీకి 308, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 27, గిరిజన కార్పొరేషన్ ఆధ్వర్యం లో 42, ఇతరులు 37 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
యాసంగి వడ్ల కొనుగోలు కో సం అవసరమైన ఇతర వసతుల ను ఏర్పాటు చేస్తున్నారు.
ఆరు జిల్లాల్లో కలిపి 2.37 కోట్ల బస్తాలు(గోనె సంచులు) అవసరమవుతున్నాయి. ప్రభుత్వం వీటిని పం పిస్తున్నది. అకాల వర్షాలతో పంట దెబ్బతినకుండా ఉండేందుకు వీ లుగా 22,401 టార్పాలిన్లు అందుబాటులో పెట్టారు. మరో 4,401 టార్పాలిన్లను తెప్పిస్తున్నారు. 1,478 కాంటా మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మరో 67 మిషన్లను సమకూర్చుతున్నారు. తేమను కొలిచేందుకు ఆరు జిల్లాల్లో 1,141 మిషన్లు ఉన్నాయి. మరో 135 మిషన్లను తెప్పిస్తున్నారు. 896 ప్యాడీ క్లీనర్స్ అందుబాటులో ఉండగా మరో 199 ప్యాడీ క్లీనర్స్ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చేందుకు వీలుగా ఆరు జిల్లాల్లో 250 పచ్చి బియ్యం మిల్లు లు, 79 ఉప్పుడు బియ్యం మిల్లులు ఉన్నాయి. ఉమ్మ డి జిల్లాలో 43 గోదాముల్లో 2.04 లక్షల టన్నుల సా మర్థ్యం అందుబాటులో ఉంది. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు.. అక్కడి నుంచి గోదాములకు బి య్యాన్ని వేగంగా రవాణా చేసేలా ఏర్పాట్లు చేశారు.
