నర్సంపేట, హనుమకొండలో బుధవారం నిర్వహించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ సభలకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు, పలు సంఘాల ప్రతినిధులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామాలన్నీ గులాబీమయమయ్యాయి. కేటీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.
వర్ధన్నపేట/రాయపర్తి/గీసుగొండ/సంగెం, ఏప్రిల్ 19: హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో బుధవారం జరిగిన మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు వర్ధన్నపేట మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపు మేరకు స్థానిక నేతల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ ఆధ్వర్యంలో నాయకులు సభకు హాజరయ్యారు.
రాయపర్తి మండలంలోని 39 గ్రామాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హనుమకొండకు తరలివెళ్లారు. మండల ఇన్చార్జి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు నేతృత్వంలో సకల వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. గీసుగొండ మండలంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు హనుమకొండకు తరలివెళ్లారు. అలాగే, వరంగల్ 15, 16వ డివిజన్ల నుంచి పార్టీ శ్రేణులు సభకు బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్పొరేటర్లు ఆకుల మనోహర్, మనీషాశివకుమార్, డీసీసీబీ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు. సంగెం మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు హనుమకొండలో జరిగిన సభకు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి, బాలకృష్ణ, కిశోర్‌యాదవ్, పూజారి గోవర్ధన్‌గౌడ్, కొనకటి మొగిలి, గండ్రకోటి రవి, కడ్దూరి సంపత్, మల్లేశం పాల్గొన్నారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్/ఖానాపురం/దుగ్గొండి/నల్లబెల్లి/నెక్కొండ: నర్సంపేటలో జరిగిన మంత్రి కేటీఆర్ సభకు చెన్నారావుపేట మండలం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. మండల పరిధిలోని మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బైక్‌లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివెళ్లారు. ఉదయం 11 గంటల్లోపే వాహనాలన్నీ నర్సంపేటలో బారులుతీరాయి. మంత్రి కేటీఆర్ తొలిసారి నర్సంపేటకు రావడంతో కార్యకర్తలు ఉత్సాహంగా సభలో పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలోని ద్వారకపేటలో జరిగిన మంత్రి కేటీఆర్ సభకు నర్సంపేట మండలంలోని 27 గ్రామాల నుంచి భారీగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ పార్టీ శ్రేణులకు సభకు తరలించారు. ఖానాపురం మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులను ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు నర్సంపేటకు వాహనాల్లో తరలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, బూస రమ, అశోక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం నుంచి టీఆర్ఎస్ నేతలు వాహనాల్లో నర్సంపేటకు భారీగా తరలివెళ్లారు. టీఆర్ఎస్ శ్రేణులు గిర్నిబావి సెంటర్‌కు చేరుకోగా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, గుండెకారి రంగారావు, శానబోయిన రాజ్‌కుమార్, లింగంపల్లి రవీందర్రావు, బొమ్మినేని శ్రీనివాస్‌రెడ్డి, జంగ రాజిరెడ్డి, గుడిపెల్లి ధర్మారెడ్డి, ఓడేటి తిరుపతిరెడ్డి, బుస్సాని రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెక్కొండ మండలం నుంచి వందకు పైగా వాహనాల్లో మూడు వేల మందికి పైగా టీఆర్ఎస్ శ్రేణులు నర్సంపేటకు తరలివెళ్లారు. ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నెక్కొండ, రెడ్లవాడ, సూరిపల్లి సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, ఘంటా దామోదర్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, టీఆర్ఎస్ మండల నాయకులు తాటిపెల్లి శివకుమార్, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, కొనిజేటి భిక్షపతి, దేవనబోయిన వీరభద్రయ్య, మాదాసు రవి, కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, పొడిశెట్టి సత్యం, ఈదునూరి యాకయ్య, రావుల భాస్కర్‌రెడ్డి, బొడ్డుపల్లి రవి, బక్కి కుమారస్వామి పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం నుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో 29 జీపీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రుద్రగూడెంలో జాతీయ రహదారిపై పార్టీ మండల అధ్యక్షుడు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, నాయకలు పాలెపు రాజేశ్వర్‌రావు, హింగ్లి శివాజీ పాల్గొన్నారు.