ఐనవోలు, ఏప్రిల్ 15 : జిల్లా వ్యాప్తం గా శుక్రవారం గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామాల్లో శిలువ మార్గం ప్రదర్శనలు నిర్వహించారు. ఐనవోలులో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు పాల్గొని మాట్లాడారు. మానవాళికి సత్యమార్గాన్ని బోధించడమే ఏసుక్రీస్తు ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఐనవోలు ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యు డు మునిగాల సంపత్‌కుమార్, నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, వర్ధన్నపేట సొసైటీ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పనా మధుకర్, నాయకులు మహేందర్, అనిల్, క్రైస్తవులు పాల్గొన్నారు.
భీమారంలో.. 
హసన్‌పర్తి : భీమారంలోని పరిశుద్ధ ఆత్మ దేవాలయంలో ఫాదర్ అంబటి బాల ఆధ్వర్యంలో గుడ్‌ప్రైడే ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు శిలువతో మరణించిన ఉందంతాన్ని స్మరించుకుంటూ శిలువ మార్గం ప్రదర్శించారు. కార్యక్రమంలో సంగాల బాబు, చర్చి ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్, రమేశ్, విక్టర్‌బాబు పాల్గొన్నారు.
ధర్మసాగర్ మండలంలో..
ధర్మసాగర్ : మండల కేంద్రం బస్టాండ్‌లోని అమర వీరుల స్తూపం వద్ద పునీత అంతోని వారి దేవాలయం విచారణ గురువు మారపెల్లి ప్రవీణ్ శిలువ యాత్ర ను ప్రారంభించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు యాత్ర కొనసాగింది. తాటికాయాలలో ఫాదర్ థామస్, కరుణాపురంలో ఫాదర్ సుధాకర్‌రెడ్డి, కమల్, శిలు వ యాత్రలను నిర్వహించారు. పంతులు పట్ల శ్రీనివాస్, కమలాకర్, సంఘ పెద్దలు సురేందర్, రాజన్‌బాబు, ఏలియా, ప్రవీ ణ్, రమేశ్, చార్లి, ప్రభుదాసు పాల్గొన్నారు.
వేలేరులో.. 
వేలేరు : మండల కేంద్రంలో శిలువతో పర్యటిస్తూ గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఉత్స వ కమిటీ అధ్యక్షుడు బొల్లం రాజు, వార్డు సభ్యుడు జోగు ప్రసాద్ పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల : గుడ్‌ఫ్రైడే సందర్భంగా పట్టణంలోని సీఎస్ఐ, డివైన్ మెర్సీ క్యాథలిక్ చర్చి, జనరేతు ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డివైన్ మెర్సీ క్యాథలిక్ చర్చి నిర్వాహకుల ఆధ్వర్యంలో శిలువ ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, శనిగరపు రజిని, చర్చి ఫాదర్లు నవీన్, కమల్, శనిగరపు నవీన్, బచ్చు కరుణాకర్ పాల్గొన్నారు.
దామెరలో..
దామెర : ఊరుగొండలోని పునీత థెజమ్మచర్చిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ రంజిత్‌కుమార్ దివ్వబలిపూజ సమర్పించి, ఏసుక్రీస్తు బోధనలను వినిపించారు. పురవీధుల్లో శిలువను ఊరేగించారు. కార్యక్రమంలో జన్ను సాంబ య్య, ఉపదేశి మొగిలి, ఫ్రాన్సిస్ సంఘ పెద్దలు లక్ష్మీనారాయణ, స్వామి, కుమారస్వామి, రాణి, కోమల, రూప, రమేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే, దామెర, పులుకుర్తిలో కూడా గుడ్‌ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
కాజీపేటలో.. 
కాజీపేట : కాజీపేటలోని బాపూజీనగర్‌లోని గేధ్మెన్స్ మందిరం, డీజిల్ కాలనీ వెలంకణి చర్చి, సోమిడిలోని బాలయేసు మందిరం, ఇన్ఫాంట్ జీసెస్ చర్చి, వెంకటాద్రి నగర్‌లోని కర్మెల్ చర్చి, రహమత్‌నగర్‌లోని సీఎస్ఐ, బీఎల్ఎం చర్చి, తెలుగు బాపిస్ట్ చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విచారణ గురువులు ఫాదర్లు ఆనంద్, కిరణ్ సందేశమిచ్చారు.
కొత్తగట్టుసింగారంలో..
శాయంపేట : మండలంలోని కొత్తగట్టుసింగారం గ్రామంలో క్రైస్తవులుఏ శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విచారణ గురువు రంజిత్‌కుమార్ ప్రసంగించారు.