నయీంనగర్, మార్చి16 : అనుమానాస్పదస్థితిలో బ్యాంకు మేనేజర్ మృతి చెందిన సంఘటన కేయూ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. సీఐ జనార్దన్‌రెడ్డి కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లి చెందిన బ్యాంకు ఉద్యోగి ప్రవీణ్‌నాయక్ కు 2019లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు నెహ్రూనగర్‌కు చెందిన బ్యాంకు మేనేజర్ అనూషతో వివాహం జరిగింది. వీరు రెండు సంవత్సరాల కుమారుడితో కలిసి గోపాలపురంలోని బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అనూష నాలుగు నెలల గర్భిణి. గతంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు మహేశ్, సత్తమ్మ, నవ్య, శ్రీనివాస్ కోరిక మేరకు టీవీ, ఫ్రిడ్జి, కారు, 20 తులాల బంగారాన్ని అనూష తల్లిదండ్రులు ఇచ్చారు. ఎకరం భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని 10 రోజుల క్రితం ప్రవీణ్ అనూషను కొట్టి పుట్టింటి వద్ద వదిలేశాడు. కొడుకును తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అనూషను ప్రవీణ్ ఇంటికి తీసుకొచ్చి అడిగిన పొలం ఇస్తామని చెప్పి వెళ్లారు. మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎప్పుడు చిత్రహింసలు పెడుతాడని ఏడ్చిందని, అదే రోజు రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఎటువంటి అనుమానం రాకుండా కుటుంబసభ్యులు అనూష మృతదేహాన్ని వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించారని బంధువులు ఆరోపించారు. అనూష అన్న వీరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌పై కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ జనార్ద న్‌రెడ్డి తెలిపారు. ఎంజీఎం మార్చురీలో అనూష మృతదేహాన్ని హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన..
అనూష కుటుంబసభ్యులు కేయూ పోలీసు స్టేషన్ ఎదుట ఆం దోళన చేశారు. తమకు తెలియకుండా ఏ విధంగా పోస్టుమార్టాని కి పంపిస్తారని బైఠాయించారు. ఏమైనా ఉంటే పిటిషన్ రాసి వ్వండని పోలీసులు చెప్పడంతో వారు ఆందో ళన విరమించారు.