వరంగల్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)నానాటికీ చతికిల పడుతున్న ‘చేతి’ పార్టీ ఇప్పుడు సంస్థాగత సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నది. శాసనసభ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటి వరకు పూర్తయిన సభ్యత్వాల డబ్బు చెల్లించాలని టీపీసీసీ పదేపదే ఆదేశాలిస్తున్నా జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ నేతలు పట్టించుకోవడంలేదు. అసెంబ్లీ నియోజకవర్గాలపై నాయకత్వం తేల్చ కుండా సభ్యత్వ నమోదు డబ్బు చెల్లించేది లేదని తెగేసి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై తేల్చితేనే సభ్యత్వ నమోదు డబ్బు చెల్లిస్తామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను లెక్కలోకే తీసుకోవడంలేదు. ఎన్నిక ల్లో టిక్కెట్ కోసం ఏం చేయాలో తమకు తెలుసు నని, సభ్యత్వ నమోదుకు, పోటీ చేసే అవకాశానికి సంబంధం లేదని అంటున్నారు. పీసీసీ నాయ కత్వ తీరుతో సభ్యత్వ నమోదులో కీలకంగా పని చేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాం గ్రెస్పై, పీసీసీ నాయకత్వంపై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా తమ స్థాయిలో సభ్యత్వ నమో దు చేశామని, అయినా అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై సూత్రప్రాయంగా అయి నా స్పష్టత ఇస్తేనే సభ్యత్వ నమోదు డబ్బు ఇస్తా మని అంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా అం తటా ఇదే పరిస్థితి ఉంది. 2014 సాధారణ ఎన్ని కల నుంచి ప్రజలు ఆ పార్టీని పెద్దగా ఆదరించ డంలేదు. సభ్యత్వ నమోదులోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది.
స్పందన లేక గడువు పెంపు..
ఏఐసీసీ ఆధ్వర్యంలో ఇటీవల కాంగ్రెస్ సభ్య త్వం చేపట్టింది. ఈ సారి మొదటిసారిగా డిజిటల్ ప్రక్రియలోనే నిర్వహిస్తోంది. ఇన్సూరెన్స్ సదుపా యం ఉంటుందని ప్రకటించింది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం వంద మంది చొప్పున సభ్యులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో సభ్యత్వానికి రూ.35గా నిర్ణయించింది. పార్టీ పరంగా నిర్ణయాలు బాగానే ఉన్నా ప్రజల నుంచి స్పందన లేకుండా పోయింది. సభ్యత్వ నమోదు లక్ష్యానికి, చేసిన సభ్యత్వానికి బాగా తేడా ఉండడంతో తుది గడువులను వరుసగా పొ డిగించుకుంటూ పోతున్నారు. గడువు పొడిగింపు ను చివరగా మార్చి ఆఖరుగా నిర్ణయించారు. టీపీసీసీ నాయకత్వం అన్ని నియోజకవర్గాలకు స భ్యత్వ నమోదు లక్ష్యాన్ని ఇచ్చింది. వచ్చే ఎన్ని కల్లో టిక్కెట్ ఆశించే నేతలు పోటాపోటీగా చేస్తార ని ఆశించింది. ప్రజల్లో స్పందన లేకపోవడంతో సభ్యత్వ నమోదు ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు అయిన సభ్యత్వానికి సంబం ధించిన డబ్బును పార్టీకి ఎవరూ చెల్లించడంలేదు. డిజిటల్ రూపంలో నమోదైన వారి పేరుతో చెల్లిం చే మొత్తం విషయంలో అయోమయం నెలకొన డంతో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ గందరగోళంగా మారింది. సభ్యత్వ నమోదులోనే ఈ పరిస్థితి ఉంటే ఇక ఎన్నికల్లో ఎలా ఉంటుం దోనని కాంగ్రెస్ ముఖ్య నేతలు వాపోతున్నారు.