తొర్రూరు, మే 29 : ‘టెట్’ కోసం నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇప్పించి ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు సాధించేందుకు సహకారాన్ని అందించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్‌కు రుణపడి ఉంటామని శిక్షణార్థులు తెలిపారు. 60 రోజుల పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరులో ఉచిత బోధన, భోజన, వసతి కల్పిస్తూ నిర్వహించిన టెట్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది.
ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన అభ్యర్థులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ట్రస్ట్ చైర్పర్సన్ ఉష చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పట్టణ ప్రాంతాలకు పరుగులు పెట్టకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూనే తొర్రూరులో అనుభవజ్ఞులైన నిపుణులతో నాణ్యమైన బోధన అందించి, ఎంతో మంది పేద, మధ్య తరగతి వర్గాల నిరుద్యోగులకు బాసటగా నిలిచారని పలువురు పేర్కొన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి నిరుద్యోగులకు చేయూతనిచ్చేలా టెట్ శిక్షణ ఇప్పించి మాలో ఆత్మవిశాస్వాన్ని నింపారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు, పాలకుర్తి కోచింట్ సెంటర్ల పరిశీలకులు పంజా కల్పన, సోషల్ మీడియా అధ్యక్షుడు ఎర్రం రాజు పాల్గొన్నారు.