వరంగల్, ఫిబ్రవరి 25 : ఖిలావరంగల్ అగడ్త, శివనగర్ మీదుగా రైల్వే ట్రాక్ పక్క నుంచి హంటర్ రోడ్డులోని 12 మోరీలను కలుపుతూ జీడబ్ల్యూఎంసీ డిజైన్ చేసిన నాలా నిర్మాణానికి రైల్వే శాఖ మోకాలడ్డుతోంది. శివనగర్ ప్రాంతంలో వరద
ముంపు నివారణ కోసం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన డక్ట్, నాలా విస్తరణ పనులు సగంలో ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డక్ట్తోపాటు రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న నాలా విస్తరణ, పటిష్టత పనుల కోసం రూ.77.50 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఖిలావరంగల్‌లోని అగడ్త చెరువు నుంచి మైసయ్యనగర్ ముంపుకాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే, శివనగర్‌లోని ప్రసాద్ దవాఖాన నుంచి పల్లవి దవాఖాన వరకు డక్ట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. పల్లవి దవాఖాన నుంచి అండర్‌బ్రిడ్జి రోడ్డు దాటించి అక్కడి నాలా నుంచి రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న నాలాకు కలుతూ 12 మోరీల వద్దకు తీసుకుపోవాలి. ఇది మైసయ్యనగర్, శివనగర్, పెరికవాడ ప్రాంతాల ముంపు నివారణకు రూపొందించిన డిజైన్. దీనికి రైల్వే శాఖ అభ్యంతరం చెబుతోంది. ట్రాక్ పక్కన ఉన్న రైల్వే శాఖ స్థలంలో నాలా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని రైల్వేశాఖఅంటోంది. దీంతో సగం వరకు పనులు పూర్తి చేసిన గ్రేటర్ అధికారులు రైల్వే శాఖ వాదనతో తలలు పట్టుకుంటున్నారు. మూడో లైన్ నిర్మాణం పేరుతో రైల్వే శాఖ సృష్టిస్తున్న అడ్డంకులతో నాలా పనులు సగంలో నిలిచిపోనున్నాయి.
జీడబ్ల్యూఎంసీకి రైల్వే శాఖ నోటీసులు
రైల్వే శాఖ అధికారులు గ్రేటర్‌కు నోటీసులు జారీ చేశారు. ట్రాక్ పక్క నుంచి ఉన్న నాలా స్థలం రైల్వే శాఖకు చెందినదని, దానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీతో పాటు ట్రాక్ పక్క నాలాకు ఆనుకునిఉన్న ఇళ్ల యజమానులకు సైతం రైల్వే శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దశాబ్దాల కాలంగా పోతున్న నాలా స్థలం ఇప్పుడు మాదని అంటే ఎలా అని గ్రేటర్ అధికారులు అంటున్నారు. రైల్వే శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులవిషయాన్ని గ్రేటర్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రేటర్, రైల్వేశాఖల మధ్య నెలకొన్న వివాదం కొలిక్కివస్తే గాని నాలా పనులు ముందుకు సాగేలా లేవు. ఇప్పటికే అధికారులు మున్సిపల్ రాష్ట్ర స్థాయి అధికారులకు పూర్తివివరాలు అందించారు. ఇక్కడి రైల్వే అధికారులు సైతం తాము ఏమీ చేయలేమని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటున్నారు.
కుదించుకుపోతున్న నాలా..
రైల్వే అధికారులు చేపడుతున్న మూడో లైన్ పనులతో ట్రాక్ పక్కన ఉన్న నాలా చిన్న కాల్వగా మారిపోయింది. సరోజ టాకీస్ వద్ద 12 మీటర్ల వెడల్పు ఉన్నా నాలా కుదించుకుపోయింది.
శివనగర్ వైపు నుంచి వచ్చే మురుగు నీరు అంతా పెరికవాడలోని నాలా పక్కన ఉన్న ఇండ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గ్రేటర్ ఇంజినీరింగ్ అధికారులు రైల్వే అధికారులతో మాట్లాడారు. పూడ్చివేసిన నాలానుక్లియర్ చేయాలని కోరారు. అయినా రైల్వే అధికారులు అవేమీ పట్టించుకోకుండా మూడో లైన్ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు.
అలైన్మెంట్ మార్చాలంటున్న
రైల్వే అధికారులు..
శివనగర్ నుంచి వస్తున్న మురుగునీటిని ప్రస్తుతం ఉన్న నాలా ద్వారా 12 మోరీలకు కలుపాలని గ్రేటర్ అధికారులు చేసిన అలైన్‌మెంట్‌ను మార్చాలని రైల్వే అధికారులు అంటున్నారు. ట్రాక్ పక్కన ఉన్న నాలా స్థలంతోపాటు కొంతమంది ఇంటి నిర్మాణాల స్థలం రైల్వే శాఖకు చెందినదని చెబుతున్నారు. ప్రస్తుతం మూడో లైన్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో పూర్తిగా నాలాను పూడ్చివేస్తున్నారు. మూడో లైన్ నుంచి బఫర్ జోన్‌కు కావాల్సినంత స్థలం రైల్వే శాఖకు ఉందని పేర్కొంటున్నారు. దశాబ్దాల క్రితం నుంచే నాలా ఉందని డిజైన్ చేశామని గ్రేటర్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న నాలా ద్వారా కాకుండా రోడ్డు మార్గం ద్వారా డక్ట్ నిర్మాణం చేసి మురుగు నీటిని మళ్లిస్తే దాదాపు మరో రూ. 50 కోట్ల వరకుఖర్చు పెరుగుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశా..
– నన్నపునేని నరేందర్, తూర్పు ఎమ్మెల్యే
రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న నాలా ద్వారా మురుగు నీరు మళ్లింపుపై రైల్వే అధికారులు అడ్డుచెప్పుతున్న విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనివైష్ణవ్తో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉన్నతాధికారులకు లేఖలు రాశా. రైల్వే, మున్సిపల్ శాఖలఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన తర్వాతే పనులు చేయాలని సూచించా. అప్పటి వరకు మూడో లైన్ నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరా. రైల్వే శాఖ అధికారుల నోటీసులతో పెరికవాడలోని ట్రాక్ పక్కన ఉ న్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి న ష్టం కలుగకుండా నాలా నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాను. రైల్వే అధికారుల