వరంగల్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయరంగంలో వినూత్న విధానాలకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా మారుతోంది. రైతులకు అవసరాలను తీర్చడంతోపాటు పంటల సస్యరక్షణ, గిట్టుబాటు ధరల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. గ్రామాలు, రైతులవారీగా పంటల లెక్కలను నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి మరో కొత్త పద్ధతిని అమలు చేస్తోం ది. వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)లు నమోదు చేసిన పంటల వివరాలకు అదనంగా స ర్వే నెంబర్లు, రైతులవారీ గా సమాచారాన్ని ఫొటోలతో సహా పొందుపరిచేలా ‘క్రాప్ బుకింగ్ ఎన్హాన్స్మెంట్’ను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. దీని కోసం ప్రత్యేకం గా ఒక యాప్‌ను రూ పొందించింది. ప్రస్తుతం సమాచారం సేకరిస్తున్న ఏఈవోలు కాకుండా మండల వ్యవసాయ అ ధికారి(ఏవో), డివిజనల్ వ్యవసాయ అధికారి(ఏడీఏ), జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో)లు స్వయంగా పంటల వద్దకు వెళ్లి పంటలను నమోదు చేస్తారు.
రైతులకు ఎంతో మేలు..
జీపీఎస్ వ్యవస్థతో ఉండే ఈ యాప్‌లో రైతు పేరు, సర్వే నెంబరు, విస్తీర్ణం, సాగైన పంట, అది ఎలా ఉంది అని తెలిసేలా ఫొటోలను, వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఏఈవోలు ఇచ్చే సమాచారాన్ని చెక్ చేసినట్లుగా ఉండడంతో పాటు పంటల సంరక్షణకు అవసరమైన మెళకువలను రైతులకు అప్పటికప్పుడు తెలియజేసేందుకు దోహదపడుతుంది. రైతులకు అన్ని సందర్భాల్లో ప్రభుత్వం అండగా నిలిచేలా క్రాప్ ఎన్హాన్స్మెంట్ యాప్ ఉపయోగపడుతుంది. వారంలో 20మంది రైతులు, 20 సర్వే నెంబర్ల వివరాలను ఒక్కో అధికారి నమోదు చేస్తున్నారు. మొబైల్ యాప్‌లో ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ యాప్ మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. వివరాలు అప్లోడ్ చేయగానే ఓటీపీ వస్తుంది.
వారానికి ఒక గ్రామం వెళ్లాలి..
రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో ఈ విధానం అమలవుతోంది. కొత్త విధానంలో భాగం గా డీఏవో వారానికి ఒక రెవె న్యూ గ్రామం, ఏడీఏ రెండు రెవె న్యూ గ్రామాలు, ఏవో రెండు రెవెన్యూ గ్రామాలను కచ్చితంగా సందర్శించాల్సి ఉంటుంది. అధికారులు పంట పొ లంలో నిల్చొని ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. ఫొటోలతో పాటు సర్వే నెంబర్ తెలిపేలా అక్షాంశాలు, రేఖాంశాలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి శనివారంలోపు అధికారులు తమ లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటోంది. క్రాప్ ఎన్హాన్స్మెంట్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. అధికారులు స్వయంగా పంటలను పరిశీలిస్తుండడంతో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ సులభమవుతోంది.
పక్కాగా వివరాలు
ప్రతి ఎకరాకు సాగునీరు, నిరంతరం ఉచి త కరెంటు, రైతుబంధుతో పెట్టుబడి సాయం వంటి ప్రభుత్వ చేయూతతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరుగుతోంది. వానకాలం, యాసంగిలో కలిపి సగటున దాదాపు రెండు కోట్ల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగవుతున్నాయి. వానకాలంలో 1.40 కోట్ల ఎకరాలు, యాసంగిలో 70లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. కూరగాయలు, పూలు, పండ్ల తోటలు వంటి అదనంగా ఉం టున్నాయి. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది?, వచ్చే ఉత్ప త్తి ఎంత?, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటికి డిమాండ్ వంటివి అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. పంటల సా గుకు అవసరమైన ఎరువులు వంటి పెట్టుబడి ఉత్పత్తులతోపాటు గిట్టుబాటు ధర దక్కేలా చూసేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం అవసరమవుతోంది.
క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్ల వారీగా సాగైన పంటలు, వాటి విస్తీర్ణం, ఉత్పత్తి అంచనాలు తెలిస్తేనే రైతులకు ఇబ్బందులు లేకుండా చూసే అవకాశం ఉం టుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అయి న వెంటనే సీఎం కేసీఆర్ పంటల సాగుపై స్పష్టమైన సమాచారం వచ్చే వ్యవస్థను రూ పొందించారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి ఒక వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ని నియమించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పడంతో రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పంటల వారీ సర్వేను మరింత పకడ్బందీగా నిర్వహించేలా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. గ్రామాలు, రైతుల వారీగా ఏఈవోలు వివరాలను నమోదు చేయడంతో పాటు ఏవో, ఏడీఏ, జిల్లా వ్యవసాయ అధికారి సైతం స్వయంగా పంటలను తప్పకుండా పరిశీలించేలా ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఎక్కువ మంది రైతుల్ని కలుస్తున్నాం
క్రాప్ ఎన్హాన్స్మెంట్ యాప్ విధా నం యాసంగిలో మొదలైంది. ఇందులో భాగంగా వారంలో 20మంది రైతులు, 20 సర్వే నంబర్లలో సాగైన పంటల వివరాలు నమోదు చేస్తు న్నాం. పంటలు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలిస్తున్నాం. యాప్ విధానంతో ఎక్కువమంది రైతులను కలుస్తున్నాం. పంటలను స్వయంగా పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు ఇస్తున్నాం.
– కేతిడి దామోదర్‌రెడ్డి,హనుమకొండ ఏడీఏ