నెక్కొండ, ఫిబ్రవరి 13 : నెక్కొండ వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. శనివారం నెక్కొండలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే నర్సంపేట దవాఖానకు తరలించారు. కాగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయనకు భార్య శోభ, కూతుర్లు గౌతమి, మౌనిక ఉన్నారు. పెద్ద కూతురు గౌతమి తండ్రి చితికి తలకొరివి పెట్టింది. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి.
అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
రామారపు పుండరీకం పార్థివదేహంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి అవసరమైన సాయం అందిస్తామన్నారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. శనివారం తనతోపాటు వివిధ కార్యక్రమాలకు హాజరైన వైస్ ఎంపీపీ తర్వాత గుండెపోటుతో మృతి చెందడం కలిచి వేసిందన్నారు. పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సమయంలో ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే దంపతులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట ఏసీపీ ఫణీందర్, మాజీ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, ఎంపీడీవో రవి నివాళులర్పించారు. సొసైటీ చైర్మన్ మారం రాము, ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా బాధ్యుడు చల్లా చెన్నకేశవరెడ్డి, నెక్కొండ సర్పంచ్ సొంటిరెడ్డి యమున, టీపీసీసీ మెంబర్ సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీశ్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, నాయకులు కొమ్మారెడ్డి సుధాకర్‌రెడ్డి, కుసుమ చెన్నకేశవులు ఉన్నారు.