పోచమ్మమైదాన్, నవంబర్ 20 : వరంగల్‌లో నిర్మిస్తున్న అన్ని జంక్షన్లను అందంగా తీర్చిదిద్దాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నర్సంపేట రోడ్డు విస్తరణ పనుల పరిశీలనలో భాగంగా పోచమ్మమైదాన్ సెంటర్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలో భాగంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాణీ రుద్రమదేవి విగ్రహం ఏర్పాటు చేసిన పోచమ్మమైదాన్ జంక్షన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మావురపు విజయభాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్లు ఎండీ ఫుర్కాన్, బాల్నె సురేశ్, యెలుగం సత్యనారాయణ, సోల రవి, మొగిలి, సురేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యత పాటించాలి..
కాశీబుగ్గ : అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం 18వ డివిజన్లోని లేబర్‌కాలనీ నుంచి బాలాజీనగర్ మీదుగా వెళ్లే దేశాయిపేటరోడ్డు వంద ఫీట్ల రోడ్డును పరిశీలించారు. అలాగే నర్సంపేట రోడ్డు, వెంకట్రామ, కాశీబుగ్గ జంక్షన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులను తొందరగా చేయాలన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, నాయకులు జక్కం దాసు, ప్రవీణ్, విజయ్‌కుమార్ ఉన్నారు.