ఐనవోలు, జూలై 17 : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామిని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ముందుగా వారికి ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చశారు. ఆలయ ఆవరణలో సంతోష్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారని చెప్పారు. పరిస్థితులను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రికి రాత్రే బయలుదేరారని పేర్కొన్నారు.
వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని, అధికారులకు దిశా నిర్దేశం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి పరీవాహక ప్రాంతాలకు వెళ్లినట్లు పేర్కొన్నారు. వర్షాలతో రాష్ట్ర, దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఐనవోలు మల్లికార్జునస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు మల్లికార్జునస్వామి ఆశీస్సులు, అండ ఉండాలని కోరుకున్నట్లు వివరించారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి 2014 నుంచి అనేక పనులు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి ఒక భక్తుడిగా తనవంతు సహకారం ఉంటుందని సంతోష్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ సంపత్‌కుమార్, సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, రాజు, ఉపసర్పంచ్ సతీశ్, మండల ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, నియోజకవర్గ అధికారి ప్రతినిధి రవీందర్, మండల నాయకులు దేవికారెడ్డి, కోమలత, నరేశ్, అరుణ్, కొమురయ్య, సురేశ్, విజయ్‌భాస్కర్, అనిల్, పరమేశ్, మాజీ సర్పంచ్ దయాకర్, వెంకన్న, సతీశ్, మహేందర్, బాబు తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న
వరంగల్ : నగరంలోని భద్రకాళి అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఆయన భద్రకాళి అలయాన్ని సందర్శించారు. ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదట వల్లభ గణపతికి అనంతరం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహా మండపంలో వారిని అర్చకులు ఆశీర్వదించారు. అమ్మవారి శేష వస్ర్తాలను బహూకరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.