కరీమాబాద్, మార్చి 15: పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలువాలని కలెక్టర్ గోపి సూచించారు. మంగళవారం జక్కలొద్ది సమీపంలోని బిర్లా ఓపెన్‌మైండ్స్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష లపై ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ విద్యార్థులకు సబ్జెక్ట్ వారీగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారిని పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షె డ్యూల్ విడుదల చేసిందన్నారు. 2022 మే 11 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో మొత్తం (ప్రైవేట్, ప్రభుత్వ) పాఠశాలలు 637 ఉన్నాయన్నారు. అందులో 10వ తరగతి విద్యార్థులు 9937 మంది ఉన్నారన్నారు. వారికి పరీక్షలపై అవగాహన కల్పించి, వారిలో భయాన్ని తొలగించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలన్నారు. వారు ఎందులో వెను కబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్‌పై ప్రత్యేక దృష్టి ఆరించి బోధన చేపట్టాలన్నారు. నాణ్యమైన విద్య ద్వా రానే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుం దన్నారు. నూరు శాతం ఫలితాలు వచ్చేలా కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా విద్యారంగంలో ప్రభు త్వం సమూల మార్పులు తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నదన్నారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులపై ప్రణాళిక తయారుచేసుకుని 12 అంశాలతో కూడిన వసతులు కల్పిస్తామన్నారు. డొనేషన్స్, సీఎస్ఆర్ ఫండ్స్, పూర్వ విద్యార్థులు తదితరుల సహకారంలో పాఠశాలల రూపురేఖలు మార్చేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పాఠశాలల్లో కిచెన్‌షెడ్, కౌంపౌండ్ వాల్, టాయిలెట్స్ తదితర పనులు చేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.