ఖానాపురం, మార్చి 15: ఖానాపురం సొసైటీని వ్యాపారపరంగా విస్తరించనున్నట్లు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ తెలిపారు. ఈమేరకు మంగళవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం సొసైటీకి ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయం మీదే ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. మనుబోతులగడ్డలో దాతలు విరాళంగా అందజేసిన 2ఎకరాల భూమిలో నూతన గోదాము, కొత్తూరులో దాతలు ఇచ్చిన రెండున్నర గుంటల స్థలంలో గోదాము నిర్మిస్తామని వివరించారు. గోల్డ్‌లోన్, వెహికల్ లోన్ ఇస్తామని చెప్పారు.
స్థానిక సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. మండలంలోని కాకతీయుల నాటి బాలుతండా త్రికూట ఆలయం, అశోక్‌నగర్ శివాలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. కొద్ది రోజుల్లో ఆ శాఖాధికారులు పరిశీలించి అభివృద్ధికి ఎస్టిమేషన్స్ తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు కృషిచేసిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పురావస్తు శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుక్రిష్ణ, డైరెక్టర్లు సాంబయ్య, రాజు, అశోక్, రమేష్, తిరుపతి, కుమారస్వామి, అచ్యుతం, సునిత, భాగ్యమ్మ, లక్ష్మణ్, సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది రాజు, వినయ్, భీమయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, అశోక్‌నగర్ సర్పంచ్ గొర్రె కవిత, సొసైటీ డైరెక్టర్ గంగాధర రమేష్, వెన్ను పూర్ణచందర్, ఆలయ కమిటీ చైర్మన్ సురేష్, బోడ బాలరాజు పాల్గొన్నారు.
ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఇటీవల నియామకం కాగా మంగళవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఓడీసీఎంఎస్ చైర్మన్ ఖానాపురం సొసైటీ చైర్మన్ మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఎంపికవడం పాకాల ఆయకట్టు రైతుల అదృష్టమన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, అశోక్‌నగర్ సర్పంచ్ గొర్రె కవిత, వెన్ను పూర్ణచందర్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుక్రిష్ణ, డైరెక్టర్లు గంగాధర రమేష్, మేకల కుమారస్వామి, ఆబోతు అశోక్, నీలం సాంబయ్య, శొంఠి లక్ష్మణ్, అన్నమనేని రవీందర్రావు, జాడి అచ్యుతమ్, వేములపల్లి సునిత, బత్తిని భాగ్మమ్మ బద్దె తిరుపతి, భూషబోయిన రాజు పాల్గొన్నారు.