నయీంనగర్, డిసెంబర్10: ‘ఈ నెల 24న జాతీయ వినియోగదారుల హక్కుల ఉత్సవాలు-2022’ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కరపత్రాలను దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ శనివారం హనుమకొండలో ఆవిష్కరించి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఒకే వేదిక ఉండాలని, అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, వినియోగదారుల సంఘాలు ఉమ్మడి వేదికపై నిర్వహిస్తున్న క్రమంలో కార్యాచరణ ప్రణాళిక విడుదల చేసిందని తెలిపారు. నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవాలో మొదటి విడుతగా రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్కు కారణమైన ఆహార కల్తీ, చిన్న పిల్లల మొదడును తినివేస్తున్న ఎంఎస్జీ మోనోసోడియం, గ్లూటామేట్ వాడకంపై చైతన్యం, అధికారుల వైఫల్యంపై న్యాయ పరమైన చర్యలు ప్రకటించారన్నారు. కార్యక్రమంలో సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, సౌత్కమిటీ ఉపాధ్యక్షుడు మొగిళిచెర్ల సుదర్శన్, రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శి నల్లా రాజేందర్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.