జేడీఏ ఉషాదయాళ్
నర్సంపేట, డిసెంబర్ 5 : నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్ తరాలకు మనుగడ ఉంటుందని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. సోమవారం నర్సంపేటలో మృత్తిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పశువుల పెంట, చెరువు మట్టి, పచ్చిరొట్ట ఎరువులు వేసి నేలను సారవంతంగా తయారు చేసుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం పంట వేయడానికి ముందు భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. పంటలు సమృద్ధిగా పండాలంటే నేలలో పోషకాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త వీరన్న, నర్సంపేట సహాయక వ్యవసాయ సంచాలకుడు అవినాశ్‌వర్మ, ఎన్ఐఎఫ్ఎం సారంగం, వ్యవసాయ విస్తరణ అధికారి మెండు అశోక్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోతె జైపాల్‌రెడ్డి, చిదురాల చక్రపాణి, మల్లాడి రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, గంట రాజేశ్వర్ పాల్గొన్నారు.